Viral: అత్త త్వరగా చనిపోవాలంటూ నోటుపై రాసి.. గుడి హుండీలో వేసి..
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:08 PM
తన అత్తకు మరణం త్వరగా రావాలంటూ ఓ భక్తడు రూ.20 నోటుపై రాసి దేవాలయంలోని హుండీలో కానుకగా వేసిన ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: మనసులో అనేక కోరికలు, బాధతలతో జనాలు దేవాలయాలకు వెళుతుంటారు. మనసులో కోరిక లేదా ఆవేదనను భగవంతుడితో మొరపెట్టుకుంటారు. తనపై కరుణ చూపాలంటూ హుండీలో ఎంతో కొంత వేసి తమను ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అయితే, అవతలి వారికి చెడు జరగాలని మాత్రం ఎవ్వరూ కోరుకోరు. అలా కోరుకుంటే దేవుడికి ఆగ్రహం వస్తుందని, ఖర్మ కాలి జీవితం తిరగబడుతుందని అనేక మంది బలంగా విశ్వసిస్తారు. అయితే, ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా తన అత్త చావును కోరుకున్న వైనం నెట్టింట తెగ వైరల్ అవుతోంది (Viral).
Viral: రోడ్డుపై వాగ్వాదం.. మహిళలను పైకెత్తి నేలకేసి విసిరికొట్టిన వ్యక్తి
కర్ణాటకలోని కులబర్గీలో ఈ ఘటన వెలుగు చూసింది. అక్కడి అఫ్జల్‌పూర్ తాలూకాలోని భాగ్యవంతీ దేవీ ఆలయంలో కొత్త సంవత్సరం సందర్భంగా హుండీ తెరిచి ఎంత ఆదాయం వచ్చిందీ లెక్క తేలుస్తున్నారు. ఈ క్రమంలో డబ్బులు లెక్క పెడుతున్న వారికి ఓ అసాధారణ నోటు దొరికింది. అది రూ.20 రూపాయల నోటు. దానిపై ‘నా అత్త త్వరగా చనిపోవాలి’’ అని రాసుంది. తన అత్త పీడ విరగడవ్వాలని కోరుతూ ఎవరో దేవుడిని ఇలా ప్రార్థించి చేతిలో డబ్బును హుండీలో వేశారని అర్థమై ఆలయ సిబ్బంది, ధర్మకర్త షాకైపోయారు.
Viral: రూ.30 లేక ఆసుపత్రి బయటే నిద్ర.. చలికి తట్టుకోలేక మృతి
ఈ ఉదంతం మీడియాలో కూడా వైరల్‌గా మారింది. ఇలాంటి కోరికలు ఎవరైనా కోరుతారా అంటూ జనాలు నోరెళ్లబెట్టారు. అవతలి వారి చెడు కోరుకున్న వారికే చెడు ఎదురవుతుందని కొందరు పెట్టారు. ఈ కోరిక కోరింది పురుషుడా, లేక స్త్రీనా అని కొందరు ప్రశ్నించారు. ఇలా రకరకాల సందేహాల నడుమ ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.
Viral: వామ్మో.. లక్ అంటే ఇదీ.. కేరళ నర్సుకు రూ.70 కోట్ల లాటరీ!
ఇక గుడి అధికారుల ప్రకారం, హుండిలో గతేడాది రూ.60 లక్షల నగదు, 1 కేజీ వెండి నాణేలు వచ్చాయి. గుడికి వచ్చేవారు తమ కానుకలను హుండీలో వేయడంతో పాటు మనసులోని కోరికలను ఇలా కరెన్సీ నోట్లపై రాసి హుండీలో వేస్తారట. నోట్లపై రాతలు సహజమే కానీ ఇలాంటి అడగకూడని కోరికను మాత్రం తాను మొదటిసారి చూస్తున్నానని గుడి వర్గాలు తెలిపాయి. ఈ వార్త స్థానిక మీడయాలో కూడా విస్తృతంగా ప్రచురితమైంది.
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక అమ్మేసిన కుటుంబ సభ్యులు.. తట్టుకోలేక టీనేజర్ ఆత్మహత్య