Wife and Husband: అక్కడక్కడ ఇలాంటి మంచి భార్యలు కూడా ఉంటారు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు చూస్తే..
ABN , Publish Date - Feb 26 , 2025 | 03:57 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత భార్యాభర్తల గురించి ఎన్నో ఫన్నీ వీడియోలు, మీమ్స్ పుట్టుకొచ్చాయి. భర్తను ఇబ్బంది పెట్టడమే భార్య లక్ష్యం అన్నట్టు రూపొందించిన ఆ వీడియోలు నవ్వులు పూయిస్తుంటాయి.

సాధారణంగా భార్యాభర్తల (Husband and Wife) అనుబంధం గురించి రకరకాల జోక్స్ చెలామణి అవుతుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత భార్యాభర్తల గురించి ఎన్నో ఫన్నీ వీడియోలు, మీమ్స్ పుట్టుకొచ్చాయి. భర్తను (Husband) ఇబ్బంది పెట్టడమే భార్య (Wife) లక్ష్యం అన్నట్టు రూపొందించిన ఆ వీడియోలు నవ్వులు పూయిస్తుంటాయి. అలాంటి వీడియోల నడుమ ఓ ఆదర్శనీయ భార్యకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతూ చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆ వీడియో చూసిన వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.
@theboysthing07 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి బైక్ షోరూమ్‌కి వెళ్ళాడు. అక్కడ, సేల్స్‌మెన్ బైక్ ఫీచర్స్ గురించి వివరిస్తున్నాడు. ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. ఆ సమయంలో, అతని భార్య వెనుక నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక చిన్న బాక్స్ ఉంది. ఆ బాక్స్‌ను ఆమె తన భర్తకు నవ్వుతూ అందించింది. ఆ బాక్స్ తెరిచి చూస్తే లోపల బైక్ తాళం కనిపించింది.
బాక్స్‌లో బైక్ తాళం చూసిన తర్వాత ఆ వ్యక్తి ఒకేసారి ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యాడు. తన భార్యను హత్తుకుని కంగ్రాట్స్ చెప్పాడు. వారి ఎమోషన్‌ను పక్కనే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 6 లక్షల మంది వీక్షించారు. 14 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అక్కడక్కడ ఇలాంటి మంచి భార్యలు కూడా ఉంటారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Snake Viral Video: వామ్మో.. ఇది మామూలు ఫైట్ కాదు.. పాముల పోరాటం ఇంత భయంకరంగా ఉంటుందా?
Optical Illusion: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ పుస్తకాల మధ్య తాళం చెవిని 5 సెకెన్లలో కనుగొనండి..
Optical Illusion: మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో ``HOT`` పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..
Rooster: కోడి నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తోంది.. కేరళ వాసి ఫిర్యాదుపై అధికారులు ఏం చేశారంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి