Share News

Actor Ajith: హీరో అజిత్‌కు యాక్సిడెంట్.. వీడియో వైరల్..

ABN , Publish Date - Jan 07 , 2025 | 06:46 PM

తమిళ సూపర్ స్టార్ అజిత్‌ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. రేసింగ్ ట్రాక్‌పై రేసింగ్ కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై కారు అదుపు తప్పి పక్కనే ఉన్న సేఫ్టీ వాల్‌ను ఢీకొట్టింది.

Actor Ajith: హీరో అజిత్‌కు యాక్సిడెంట్.. వీడియో వైరల్..
Actor Ajith Accident

చెన్నై, జనవరి 07: తమిళ సూపర్ స్టార్ అజిత్‌ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. రేసింగ్ ట్రాక్‌పై రేసింగ్ కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్‌పై కారు అదుపు తప్పి పక్కనే ఉన్న సేఫ్టీ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ట్రాక్‌పైనే రౌండ్లు రౌండ్లుగా తిరుగుతూ ఒక చోట ఆగిపోయింది. వెంటనే అలర్ట్ అయిన సేఫ్టీ గార్డ్స్.. అజిత్ కారు వద్దకు వచ్చారు. అజిత్‌‌ను బయటకు దించారు. ఈ ఘటనలో అజిత్‌కు పెద్దగా గాయాలేమీ కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారు రేసింగ్ కోసం శిక్షణ తీసుకునే క్రమంలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం మరో కారులో అజిత్ తన శిక్షణను కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. అజిత్ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. అజిత్‌కు జాగ్రత్తలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.


అజిత్ కారు ప్రమాదానికి సంబంధించిన వీడియోను కింద చూడొచ్చు..


Also Read:

19 ఏళ్ల నాటి మర్డర్ మిస్టరీకి ఏఐతో ముగింపు

బాబోయ్.. ఇలాంటి భార్య ఎవ్వరికీ రాకూడదు.. భర్త చనిపోతే..

కుప్పంలో కీలక ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

For More Viral News and Telugu News..

Updated Date - Jan 07 , 2025 | 06:46 PM