Viral Video: అమ్మా.. వస్తున్నా ఆగు.. తల్లిపై సింహం పిల్ల ఎలా కోపం ప్రదర్శిస్తోందో చూడండి..
ABN , Publish Date - Jan 05 , 2025 | 03:07 PM
ఇటీవలి కాలంలో చాలా మంది సఫారీ టూర్లకు వెళ్లి వన్యప్రాణులను దగ్గర్నుంచి చూస్తున్నారు. వాటి గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా టాంజానియా అడవిలో ఓ సింహం, దాని 14 రోజుల పిల్లకు సంబంధించిన క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మనుషులే కాదు.. జంతువులు కూడా తమ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. అవి స్వయంగా వేటాడుకునే వరకు భోజనం అందిస్తాయి. ఎలా వేటాడాలో, ఎలా కాపాడుకోవాలో, ఎక్కడ నివసించాలో మొదలైన విషయాలన్నింటినీ తమ పిల్లలకు నేర్పిస్తాయి. ఇటీవలి కాలంలో చాలా మంది సఫారీ టూర్లకు (Safari Tour) వెళ్లి వన్యప్రాణులను దగ్గర్నుంచి చూస్తున్నారు. వాటి గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా టాంజానియా (Tanzania) అడవిలో ఓ సింహం (Lion), దాని 14 రోజుల పిల్లకు (Cub) సంబంధించిన క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ laurent_samila తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోను టాంజానియాలోని సెరెంగేతి నేషనల్ పార్క్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోలో ఓ సింహంతో పాటు 14 రోజుల వయస్సు గల సింహం పిల్ల కనబడుతోంది. 14 రోజుల వయసుకే ఆ సింహం పిల్ల నడుస్తోంది, పరిగెడుతోంది. రెండు నెలల వయసు వచ్చే వరకు పిల్ల సింహాలు పూర్తిగా తల్లి సంరక్షణలోనే ఉంటాయి. తాజా వీడియోలో సింహం నడుస్తుంటే దాని వెనుక ఆ చిన్నారి సింహం పరిగెడుతోంది. తల్లి వేగంగా వెళ్లిపోతుంటే పిల్ల సింహం క్యూట్‌గా అరుస్తూ వెంబడిస్తోంది.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``తల్లిని ఆగమని గట్టిగా చెబుతోంది``, ``వావ్.. సింహం పిల్ల ఎంత అందంగా ఉందో``, ``ఈ దృశ్యాన్ని నేరుగా చూడడం చాలా గొప్ప అదృష్టం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Brain Teaser Test: మీరు బాగా అనలైజ్ చేస్తారా? అయితే ఈ ముగ్గురిలో దొంగ ఎవరో 7 సెకెన్లలో గుర్తించండి..
Viral Video: వీళ్లు అసలు మనుషులు కాదు.. అడవిలోకి వెళ్లి పులితో ఎలా ప్రవర్తించారో చూడండి..
Viral Video: వావ్.. నేచురల్ బ్యూటీ.. ఈ అమ్మాయిని చూసి నెటిజన్లు ఎందుకు ఫిదా అవుతున్నారంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి