Viral: ఇది అత్యంత చిన్న దేశం.. ఇక్కడి సైనికులకు మాత్రం ఏకంగా రూ. కోటి జీతం!
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:12 PM
ప్రపంచంలో అత్యంత చిన్న దేశం వాటికన్ సిటీలో రక్షణ బాధ్యతలు నిర్వహించే స్విస్ గార్డు సైనికుల వార్షియ ఆదాయం సుమారు రూ.కోటి ఉంటుందట.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అత్యంత చిన్న దేశం వాటికన్ సిటీ. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన స్థలం. మతపరమైన, సాంస్కృతి వారసత్వం కలిగిన వాటికన్ నగరం.. ప్రముఖ సెయింట్ పీటర్స్ బసీలికా, ది సిస్టీన్ ఛాపెల్, వాటికన్ మ్యూజియం వంటి వాటికి ప్రసిద్ధి. అయితే, ఈ అతి చిన్న దేశానికి ఓ సైనిక దళం కూడా ఉందని, సైనికులకు మొత్తం పారితోషికం రూ.కోటి ఉంటుందంటే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు (Viral).
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తుల మద పెద్ద పోప్ భద్రత కోసం వాటికన్ నగరంలో స్విస్ గార్డ్ అనే దళాన్ని ఏర్పాటు చేశారు. ఈ దళంలో కేవలం 150 మంది సైనికులే ఉంటారు. పోప్ రక్షణ బాధ్యతలు మొత్తం వీరివే. ఆయన రక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ ప్రమాణం చేశాకే వీరు విధులు చేపడతారు.
ప్రపంచంలోని అత్యంత పురాతన మిలిటరీ దళాల్లో స్విస్ గార్డు కూడా ఒకటి. ఈ దళంలో చేరే వారికి కొన్ని ప్రత్యేక అర్హతలు ఉండాలి. 19 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న పురుషుల మాత్రమే ఈ సైన్యంలో చేరేందుకు అర్హులు. కనీస ఎత్తు 5 అడుగుల ఎనిమిది అంగుళాలు ఉండాలి.
Viral: వేటగాళ్ల నుంచి కాపాడేందుకు ఖడ్గమృగం కొమ్ము తొలగింపు.. షాకింగ్ వీడియో
పోప్ రక్షణతో పాటు వాటికన్ బాధ్యతలు కూడా స్విస్ గార్డ్‌కే అప్పగిస్తారు. అయితే, వీరెప్పుడూ నేరుగా యుద్ధంలోకి దిగరు. ఇక ఈ సైనికుల జీతభత్యాలు కూడా కళ్లు చెదిరే స్థాయిలో ఉంటాయి. మీడియా కథనాల ప్రకారం, ఒక్క సైనికుడికి నెలకు 1500 నుంచి 3600 యూరోల వరకూ చెల్లిస్తారు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది ఏకంగా రూ.4.5 లక్షలకు సమానం. వీరికి ఏడాది 13 నెలల శాలరీ ఇస్తారని తెలుస్తోంది. అదనపు సౌకర్యాలు, చెల్లింపులు కూడా అనేకం ఉంటాయట. ఉచిత వసతితో పాటు, పన్ను రహిత కొనుగోళ్లు, వారి పిల్లలకు ఉచిత చదువులు, ఏటా 30 రోజుల సెలవులు వంటివి ఇస్తారు. ఈ సౌకర్యాలు, శాలరీ కలిపి చూసుకుంటే వారి వార్షిక ఆదాయం రూ.కోటి దాటుతుందని ఓ అంచనా.
Viral: అణుబాంబు తయారీలో బంగాళదుంపలు, ఉల్లిపాయలకు ముఖ్య పాత్ర!
స్విస్ గార్డు సైనికులకు సంప్రదాయక హాల్‌బర్డ్ ఆయుధాన్ని ఉపయోగించడంలో శిక్షణ ఇస్తారు. ఈ మధ్య కాలంలో వారికి ఇతర చిన్న తుపాకీల వినియోగంలోనూ శిక్షణ ఇస్తారు. ఈ సైనికులు ధరించే యూనిఫాం, టోపీలు కూడా వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా డిజైన్ చేస్తారు. వాటికన్ నగరం మొత్తం విస్తీర్ణం మొత్తం 100 ఎకరాలు. అక్కడ సుమారు 496 మంది మాత్రమే ఉంటారని సమాచారం. అయితే, సందర్శకులు మాత్రం లక్షల సంఖ్యలో వాటికన్‌కు వచ్చి వెళుతుంటారు.