Viral Horse Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా.. బీఎమ్‌డబ్ల్యూ గుర్రం బండి వీడియో వైరల్..
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:50 PM
మనదేశంలో నూతన ఆవిష్కరణల విషయంలో, శాస్త్ర పరిజ్ఞానం విషయంలో కాస్త వెనకబడి ఉండవచ్చు. కానీ, సామాన్య ప్రజలు మాత్రం తమ తెలివితేటలతో ఇతర దేశస్థులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలను మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.

భారతదేశ ప్రజలు వెరైటీగా ఆలోచించడంలో చాలా ముందు ఉంటారు. మనదేశంలో నూతన ఆవిష్కరణల విషయంలో, శాస్త్ర పరిజ్ఞానం విషయంలో కాస్త వెనకబడి ఉండవచ్చు. కానీ, సామాన్య ప్రజలు మాత్రం తమ తెలివితేటలతో ఇతర దేశస్థులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలను (Jugaad Videos) మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం అలాంటిదే మరో జుగాడ్ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది (Viral Video).
anita_suresh_sharma అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక అందమైన తెల్లని రంగు గుర్రానికి (Horse) ఒక వ్యాన్ అమర్చారు. ఆ వ్యాన్‌పై లగ్జరీ కార్ల కంపెనీ బీఎమ్‌డబ్ల్యూ లోగో ఉంది (BMW Van). ఆ వీడియో ప్రారంభంలో, ఒక వ్యక్తి కారు లాంటి గుర్రపు బండి తలుపు తెరిచి లోపల కూర్చుంటాడు. దానిని ఆ గుర్రం లాక్కుని వెళ్తోంది. ఆ గుర్రానికి బండిని బదులుగా కారు బాడీని అమర్చారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై చాలా మంది ఫన్నీ కామెంట్లు కూడా చేశారు.
సోషల్ మీడియాలో ఈ వైరల్ వీడియోను దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. 2.8 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ టెక్నాలజీ దేశం దాటి వెళ్లకూడదు``, ``కారులో వెళ్లిన ఫీలింగ్ గ్యారెంటీ``, ``ఇది రియల్ హార్స్ పవర్ కార్``, ``అతడి తెలివితేటలకు సలాం`` అంటూ సోషల్ మీడియా జనాలు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..
Optical Illusion: ఈ ఫొటోలో మీకు గుర్రం కనబడితే.. మీరు సాధారణమైన వ్యక్తి కాదు.. ప్రయత్నించండి..
Online order: రూ.61 వేల విలువైన ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేసి చూసి నివ్వెరపోయాడు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..