Wedding Gift: పెళ్లి కూతురుకి డ్రమ్ గిఫ్ట్.. పెళ్లి కొడుకు రియాక్షన్ నెక్ట్స్ లెవల్..
ABN , Publish Date - Apr 19 , 2025 | 10:08 PM
స్నేహితులు, బంధు మిత్రుల వివాహం జరిగితే.. ఎవరైనా తమకు తోచినంతలో ఒక మంచి గిఫ్ట్‌ను కొనుగోలు చేసి ఇస్తారు. సాధారణంగా బంధువులయితే నవ దంపతులకు ఉపయోగపడే వస్తువులను, ఆభరణాలను గిఫ్ట్‌గా ఇస్తుంటారు.
స్నేహితులు, బంధు మిత్రుల వివాహం జరిగితే.. ఎవరైనా తమకు తోచినంతలో ఒక మంచి గిఫ్ట్‌ను కొనుగోలు చేసి ఇస్తారు. సాధారణంగా బంధువులయితే నవ దంపతులకు ఉపయోగపడే వస్తువులను, ఆభరణాలను గిఫ్ట్‌గా ఇస్తుంటారు. స్నేహితులు.. ఫోటో ఫ్రేమ్స్, ఇతర వస్తువులను బహుమతులుగా ఇస్తుంటారు. మరీ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే.. విభిన్న ఆలోచనలతో సరికొత్త గిఫ్ట్‌లను ఇస్తారు. ఉల్లిగడ్డ ధరలు పెరిగినప్పుడు ఉల్లిగడ్డలను, టమాటా ధర పెరిగితే టమాటాలు, పెట్రోల్ ధరలు పెరిగితే పెట్రోల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన సందర్భాలు మనం ఎన్నో చూశాం. అవి వధూవరులునే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా అలాంటి సీనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంటకు తమ స్నేహితులు.. ఎవరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ చూసి పెళ్లి కొడుకు, అతని తరఫున బంధువులు హడలిపోయారంతే. మరి ఇంతకీ స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో చూసేద్దాం..
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో జరిగిన ఒక వివాహ వేడుకలో వరుడి స్నేహితులు అతనికి షాకింగ్ గిఫ్ట్ ఇచ్చారు. అది చూసి పెళ్లి కొడుకు హడలిపోయాడు. వివాహాన్ని చూసేందుకు వచ్చిన బంధుమిత్రులు సైతం అవక్కాయ్యారు. పెళ్లి కొడుకు స్నేహితులు.. పేపర్స్ చుట్టిన భారీ వస్తువును తీసుకుని వధువరుల ముందు పెట్టారు. అదిచూసిన జనాలంతా ఏదో గిఫ్టే తీసుకువచ్చారని భావించారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరూ కలిసి ఆ గిఫ్ట్‌ని ఆదుర్దాగా ఓపెన్ చేశారు. ఇంకేముంది.. దానిని చూసిన నవ వధువులు షాక్ అయ్యారు. స్నేహితులు ఆ నవ దంపతులకు బ్లూ కలర్ ప్లాస్టిక్ డ్రమ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ డ్రమ్ చూసి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురితోపాటు.. బంధుమిత్రులంతా బిత్తరపోయారు. ఆ తరువాత తేరుకుని నవ్వుకున్నారు.
డ్రమ్ గిఫ్ట్ ఇవ్వడం కాస్త సరదానే ఉండొచ్చు. కానీ, ఆ డ్రమ్ చరిత్ర దేశాన్నే కుదిపేసింది. అవును మరి.. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఆ హత్యతో డ్రమ్ చాలా ఫేమస్ అయిపోయింది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్త అయిన సౌరభ్‌ను అత్యంత కిరాతకంగా చంపేసింది. సౌరభ్ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి.. ప్లాస్టిక్ డ్రమ్‌లో సిమెంట్‌లో పూడ్చి పెట్టింది. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. అప్పటి నుంచి బ్లూ డ్రమ్ హాట్ టాపిక్ అయిపోయింది.
వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడొచ్చు..