Viral: లాస్ ఏంజిలిస్ కార్చిచ్చు.. లాటరీ సొమ్ముతో కొన్న ఇల్లు బుగ్గిపాలు!
ABN , Publish Date - Jan 11 , 2025 | 11:45 PM
ఓ లాటరీ విజేత తాను గెలిచిన సొమ్ముతో కొనుక్కున్న ఓ విలాసవంతమైన భవనం లాస్ ఏంజిలిస్ కార్చిచ్చు మంటల్లో పడి బూడిదకుప్పగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: కార్చిచ్చు లాస్ ఏంజిలిస్ నగరాన్ని బుగ్గి పాలు చేసింది. లాటరీ సొమ్ముతో కొనుగోలు చేసిన ఓ ఇల్లు ఈ మంటల్లో పడి బుగ్గిపాలైంది. దీంతో, ఇంటి యజమాని తీవ్ర షాక్‌లో కూరుకుపోయాడు. కాలిఫోర్నియాకు చెందిన ఎడ్విన్ కాస్ట్రో గతేడాది ఫిబ్రవరిలో ఏకంగా రూ.16 వేల కోట్లు గెలుచున్నాడు. ప్రపంచంలోనే అతి భారీ లాటరీ విజేతగా రికార్డు సృష్టించాడు. లాటరీలో గెలిచిన సొమ్ములోంచి కొంత మొత్తంతో లాస్‌ఏంజిల్‌లోని లగ్జరీ ప్రాంతంలో ఓ ఖరీదైన బంగళా కొన్నాడు. కానీ ఆ ప్రాంతాన్ని కార్చిచ్చు కబళించడం అతడి భవనం మొత్తం బుగ్గిపాలైంది. సకల సౌకర్యాలతో విలసిల్లిన భవనం ప్రస్తుతం బూడిద కుప్పగా మారింది (Viral).
Viral: విమానంలో వైఫై సర్వీసు వెనక సాంకేతికత ఏంటో తెలుసా?
స్థానిక మీడియా కథనాల ప్రకారం, క్యాస్ట్రో ఇంటి గారేజ్‌లోని ఖరీదైన కార్లన్నీ మంటల్లో పడి బూడిదైపోయాయి. ఇంటికి సమీపంలోని సముద్ర తీరాన ఉన్న విలాసవంతమైన పడవ మినహా క్యాస్ట్రోకు ఏమీ మిగల్లేదు. ఆ ఇంటిలో ఐదు బెడ్ రూంలు, ఆరు బాత్‌రూంలు ఉండేవి. లాటరీ సొమ్ముతో ఇల్లు కొన్న అతడు స్థానికంగా సెలబ్రిటీగా మారాడు. ఆ ప్రాంతంలోనే పలువురు సినీ, టీవీ ప్రముఖుల ఇళ్లు కూడా ఉన్నాయి.
Viral: భారతీయ రైల్వేకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే రైలు ఏదో తెలుసా?
పవర్ బాల్ లాటరీలో క్యాస్ట్రో ఏకంగా 2.04 బిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. అయితే, పన్నులో పోను చివరకు అతడికి సగానికి కాస్త తక్కువగా అంటే.. 997 మిలియన్ డాలర్లు చేతికొచ్చింది. ఈ క్రమంలో అతడు 25 మిలియన్ డాలర్లు పెట్టి ఆ భవంతిని కొనుగోలు చేశాడు. ఎంతో ఆశపడి కొనుక్కున్న భవనం ఇలా బుగ్గిపాలు కావడంతో అతడు దిగాలు పడిపోయాడు.
కాగా, ఇప్పటికీ నగరంలో కార్చిచ్చు కొనసాగుతోందని స్థానిక మీడియా చెబుతోంది. ఇప్పటివరకూ 35 వేల ఎకరాలు మంటల్లో పడి బుగ్గిగా మారింది. మరోవైపు, అధికారులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు 1.8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గాలుల తీవ్ర ఎక్కువగా ఉండటంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం అక్కడ అంతా పొడిగా ఉండటం కూడా పరిస్థితి మరింత జటిలం చేసింది.
Viral: ఉద్యోగులకు చాకిరీ ఎక్కువగా ఉన్న దేశాలు.. ఇక్కడి వారు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారంటే..