Share News

Viral: బాస్మతీ రైస్ బ్యాగుతో షాపింగ్‌కు వచ్చిన అమెరికా ధనవంతురాలు.. షాక్‌లో జనాలు!

ABN , Publish Date - Jan 03 , 2025 | 11:49 AM

ఖరీదైన లగ్జరీ దుస్తులు ధరించిన ఓ అమెరికా మహిళ.. జనపనారతో చేసిన బియ్యం సంచీతో షాపింగ్‌కు రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Viral: బాస్మతీ రైస్ బ్యాగుతో షాపింగ్‌కు వచ్చిన అమెరికా ధనవంతురాలు.. షాక్‌లో జనాలు!

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడంటే రోజులు మారిపోయాయి కానీ మనదేశంలో కొంత కాలం వరకూ జనపనార బ్యాగులను అన్ని అవసరాలకూ నిస్సంకోచంగా వాడుకునేవారు. ముఖ్యంగా బియ్యపు బస్తాలను విరివిగా వినియోగించుకునేవారు. బయటకు తీసుకెళ్లేందుకు కూడా ఇబ్బందిపడేవారు కాదు. కానీ ఫ్యాషన్ స్పృహ, లగ్జరీ వస్తువులపై మక్కువ పెరిగాక పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అనేక మంది ఇప్పుడు ట్రెండీగా కనిపించేందుకే ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ అమెరికా మహిళ ఉదంతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. జనపనారతో చేసిన బియ్యం బ్యాగుతో ఆమె షాపింగ్‌కు వచ్చిన తీరు జనాల్ని షాక్‌కు గురి చేస్తోంది (Viral).

Viral: ప్రపంచంలో అతి భారీ ట్రాఫిక్ జామ్! 100 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!


అమాండా జాన్ మాంగలాథిల్ అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉదంతాన్ని షేర్ చేశారు. ఖరీదైన దుస్తులు ధరించి ధనికురాలిలా ఉన్న ఆమె ఇలాంటి బ్యాగుతో షాపింగ్‌కు రావడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఆమె షేర్ చేసిన ఫొటోలోని మహిళ జనపనారతో చేసిన బ్యాగతో వచ్చింది. అది ప్రత్యేకంగా షాపింగ్ కోసం చేసిన బ్యాగు కాదు. అంతకుముందు బియ్యం ఉన్న బ్యాగును ఖాళీ చేసి తీసుకొచ్చినట్టు కనిపించడంతో జనాలు ఆశ్చర్యపోయారు. ‘‘అమెరికాలో ప్రస్తుతం ఏం ట్రెండ్ అవుతోందో మీరూ చూడండి. ఈ బ్యాగు ఇండియాలో అతి తక్కువ ధరకు లభిస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు.

Viral: అపాయింట్‌‌మెంట్ లెటర్ అందిన మరుసటి రోజే రిటైర్మెంట్.. టీచర్‌కు వింత అనుభవం!


కాగా, ఈ ఉదంతం నెట్టింట సడెన్‌గా వైరల్ అయిపోయింది. మహిళ క్రియేటివిటీ, పర్యావరణ హిత ఫ్యాషన్ తదితర అంశాలపై చర్చకు దారి తీసింది. రోజువారి వస్తువులను పునర్వినియోగించడం మంచి అలవాటని కొందరు అన్నారు. ప్రజల్లో పెరిగి పోతున్న ఫ్యాషన్ మోజుపై విమర్శా లేక ఓ ఫ్యాషన్‌ తీరును ట్రై చేయాలన్న కోరికా అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. ఇక ఈ అంశంపై సెటైర్లు కూడా ఇదే స్థాయిలో పెరిగాయి. ‘‘బాస్మతీ బ్యాగు ఉండంగా గుచ్చీ బ్యాగు ఎవరికి కావాలి’’ అని ఓ వ్యక్తి సరదా కామెంట్ చేశాడు. ‘‘అమెరికా కూడా భారతీయ ట్రెండ్లను అనుసరిస్తోంది’’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ‘‘జనపనార బ్యాగులతో ప్రయోజనాలను అమెరికన్లు కూడా అర్థం చేసుకుంటున్నారు’’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చారు.

Viral: ఇది అత్యంత చిన్న దేశం.. ఇక్కడి సైనికులకు మాత్రం ఏకంగా రూ. కోటి జీతం!

Viral: కాటరాక్ట్ ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ కంట్లో ఏకంగా 27 కాంటాక్ట్ లెన్సులు! వైద్యులకే భారీ షాక్

Updated Date - Jan 03 , 2025 | 11:56 AM