Share News

Viral: కలలో కనిపించిన సంఖ్య ప్రకారం లాటరీ టిక్కెట్టు కొన్న మహిళ.. చివరకు ఊహించని విధంగా..

ABN , Publish Date - Jan 10 , 2025 | 06:34 PM

తనకు కలలో కనిపించిన ఓ సంఖ్యపై లాటరీ టిక్కెట్టు కొన్న మహిళపై కనకవర్షం కురిసింది. ఏకంగా రూ.40 లక్షల లాటరీ తగలడంతో ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది.

Viral: కలలో కనిపించిన సంఖ్య ప్రకారం లాటరీ టిక్కెట్టు కొన్న మహిళ.. చివరకు ఊహించని విధంగా..

ఇంటర్నెట్ డెస్క్: ధనవంతులు కావాలని ఎందరో కలలు కంటారు. కొందరు కష్టపడి ఆ కలలను నిజం చేసుకుంటారు. మరికొందరికి కలలు వాటంతటవే నిజమవుతాయి. అమెరికాకు చెందిన ఓ మహిళ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. రాత్రి కలలో కనిపించిన ఓ సంఖ్య ఆమెను రాత్రికి రాత్రి లక్షాధికారిని చేసింది. కనకవర్షం కురిపించింది. మేరీలాండ్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగానే కాకుండా నెట్టింట కూడా తెగ వైరల్ అవుతోంది.

ప్రిన్స్ జార్జి కౌంటీకి చెందిన ఓ మహిళ గత డిసెంబర్‌లో ఓ కల వచ్చింది. కలలో ఐదు అంకెలు ఉన్న ఓ సంఖ్య కనిపించింది. మెళకువ వచ్చాక కూడా మనసులో ఆ సంఖ్య నిలిచే ఉంది. మనసుపై అంత గాఢ ముద్ర ఎందుకు పడిందో ఆమెకు అర్థం కాలేదు. భర్తతో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది (Viral).

Viral: భారీ శబ్దంతో భారతీయుల పెళ్లి ఊరేగింపు.. మండిపడ్డ కెనడా మహిళ.. వీడియో వైరల్


ఆ తరువాత ఇద్దరూ అదే నెంబర్‌పై ఓ లాటరీ కొన్నారు. కానీ బిజీలో పడి ఆ విషయాన్ని మర్చిపోయారు. అయితే, డిసెంబర్ 20న లాటరీలో మాత్రం మహిళ పంట పడింది. ఆమెకు కలలో వచ్చిన సంఖ్యకే లాటరీ తగలడంతో ఏకంగా 50 వేల డాలర్లు గెలుచుకుంది. విషయం భర్తకు చెబితే అతడు కూడా నమ్మలేకపోయాడు. ‘‘నా భార్య చెబితే మొదట నమ్మలేదు. ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు’’ అని అన్నారు. కాగా, ఈ సొమ్ముతో ఏం చేయాలా అనే అంశంలో ఆ దంపతులు రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. ఆమె ప్లాన్ ప్రకారం చేసేందుకు తాను రెడీ అని అతడు చెప్పుకొచ్చాడు.

Viral: ఇన్ఫీ నారాయణ మూర్తిని మించిపోయిన ఎల్‌ అండ్ టీ చైర్మన్! వారానికి 90 గంటలు పనిచేయాలంటూ పిలుపు


ఇటీవల సింగపూర్‌లోని ఓ భారత సంతతి వ్యక్తికి కూడా దాదాపు ఇలాగే అదృష్టం కలిసొచ్చింది. అతడు తన భార్య కోసం ఓ జువెలరీలో బంగారు నగలు కొన్నాడు. ఈ క్రమంలో నగల షాపు వారు తమ కస్టమర్లు నిర్వహించిన లాటరీలో అతడికి బంపర్ ఆఫర్ తగలడంతో ఆశ్చర్యపోయాడు. ఏకంగా రూ.8.45 కోట్లు రావడంతో ఆయన ఆనందానికి అంతేలేకుండా పోయింది. అప్పట్లో ఈ ఉదంతం పెను సంచలనానికే దారి తీసింది.

Read Latest and Viral News

Updated Date - Jan 10 , 2025 | 07:26 PM