Share News

Viral Video: తాచుపాము కాటు వేసిన తర్వాత కూడా వీడియో చేశాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..

ABN , Publish Date - Jan 04 , 2025 | 08:55 PM

కొందరు వ్యక్తులు పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొందరు ధైర్యవంతులు పాములతో ఆటలాడుతూ వీడియోలు రూపొందిస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పాపులారిటీ సంపాదిస్తున్నారు.

Viral Video: తాచుపాము కాటు వేసిన తర్వాత కూడా వీడియో చేశాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
Diamondback Rattlesnake

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే (Snakes) భయపడతారు. పాములున్నాయని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు. అయితే కొందరు మాత్రం పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొందరు ధైర్యవంతులు పాములతో ఆటలాడుతూ వీడియోలు రూపొందిస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పాపులారిటీ సంపాదిస్తున్నారు. తాజాగా అమెరికాకు (USA) చెందిన ఓ కుర్రాడు కూడా అలాగే చేశాడు. అయితే అనుకోకుండా తాచు పాము కాటుకు (Snake Bite) గురయ్యాడు. అయినా బెదరకుండా తన వీడియోను కొనసాగించాడు (Viral Video).


@CollinRugg అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఫ్లోరిడాకు చెందిన 25 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన స్నేహితులతో కలిసి అడవిలో తిరుగుతన్నప్పుడు వారికి అత్యంత విషపూరితమైన డైమండ్‌బ్యాక్ రాటిల్‌స్నేక్ కనిపించింది. ఆ పాము దగ్గరకు వెళ్లి వీడియో తీసేందుకు ప్రయత్నించడంతో అది అతడిని కాటేసింది. అతడి కాలులోకి విషాన్ని దించింది. అంత ప్రమాదకర పాము కాటేసిన తర్వాత కూడా ఆ వ్యక్తి భయపడలేదు. అక్కడే ఉండి వీడియోను కొనసాగించాడు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో అతడిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.


అతడిని కాపాడేందుకు డాక్టర్లు పెద్ద యుద్ధమే చేశారు. అతడు రెండు వారాల పాటు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో అతడికి ఏకంగా 88 యాంటీ-వీనమ్ ఇంజెక్షన్‌లు చేశారు. అతడి కాలు నల్లగా మారిపోయింది. అతడు ఇప్పటికీ తన మోకాలను కదల్చలేకపోతున్నాడు. ఏదేమైనా అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల మంది వీక్షించారు. 89 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: వీళ్లు అసలు మనుషులు కాదు.. అడవిలోకి వెళ్లి పులితో ఎలా ప్రవర్తించారో చూడండి..


Viral Video: వావ్.. నేచురల్ బ్యూటీ.. ఈ అమ్మాయిని చూసి నెటిజన్లు ఎందుకు ఫిదా అవుతున్నారంటే..

Viral Video: ఈమె తెలివితో గీజర్ కంపెనీలకే షాక్.. కరెంట్ అవసరం లేకుండా నీటిని ఎలా వేడి చేస్తోందో చూడండి..


Optical Illusion Test: మీ కళ్లకు సరైన టెస్ట్.. ఈ బీరువాలో కాఫీ మగ్ ఎక్కడుందో 7 సెకెన్లలో గుర్తించండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 04 , 2025 | 08:55 PM