Coconut viral Video: ఇదేం ఫుడ్ కాంబినేషన్ బాబోయ్.. కొబ్బరినీళ్లను ఇలా చేసి తాగాడేంటీ.. స్విగ్గీ కామెంట్..
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:38 PM
Coconut Lays viral Video: నెటిజన్లను దృష్టిని ఆకర్షించేందుకు రకరకాల ఫీట్లు చేస్తుంటారు వ్లోగర్లు. అలా ఓ వ్యక్తి ఎవరూ ఎప్పుడూ చేయని విధంగా ఓ వింత ఫుడ్ కాంబినేషన్ పరిచయం చేశాడు. ఇది చూసినవాళ్లంతా ఇదేంట్రా బాబోయ్ ఇలా చేశాడని నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ, ఆ వీడియోలో అంత సీన్ ఏముందని అనుకుంటున్నారా..
Coconut Lays viral Video: రకరకాల పదార్థాలతో ఎప్పటికప్పుడు కొత్త రుచులు సృష్టించే వ్లోగర్లను అందరూ చూసే ఉంటారు. కానీ.. ఇలాంటి వ్లోగర్ ను మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే కిచెన్ మొహమే ఎరుగని ఈ వీరుడు విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్ నెటిజన్లకు పరిచయం చేయడమే కాదు. స్వయంగా టేస్ట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొబ్బరి నీళ్లను ఇలా తాగే సాహసం చేసిన ఆ మొనగాడ్ని చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి అసాధ్యమైన ప్రయోగం ఇతడు తప్ప ఎవరూ చేయలేరేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ, ఆ వైరల్ వీడియో ఏదో మీకూ తెలుసుకోవాలనుందా..
కొత్త కొత్త ఫుడ్ గురించి నెటిజన్లకు పరిచయం చేయడం చాలా మంది వ్లోగర్లకు అలవాటే. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. బెస్ట్ ఎనర్జీ డ్రింక్స్ లో కొబ్బరినీళ్లకు మించింది లేదని అందరికీ తెలిసిందే. ఈ నీళ్లను లేస్ ప్యాకెట్ చిప్స్ లో కలుపుకుని తాగేవాళ్లని మీరెప్పుడైనా చూశారా.. అసలు ఇలాంటి కాంబినేషన్ ఒకటి ఉంటుందని ఊహించారా.. కానీ, ఇదే పనే చేసి ఇంటర్నెట్ ను షాక్ లో ముంచెత్తాడు ఓ వ్లోగర్. ఆ వైరల్ వీడియో చూస్తే ఇదేం టేస్ట్ రా బాబోయ్ అనక మానరు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో వ్లోగర్ "కొబ్బరి బోండాల అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్లి తన దగ్గరున్న లేస్ ప్యాకెట్ ఇస్తాడు. అందులో కొబ్బరి నీళ్లు పోయమని అడుగుతాడు. అమ్మే వ్యక్తి కూడా ఏ మాత్రం కంగారుపడకుండా జాగ్రత్తంగా ఆ ప్యాకెట్ కట్ చేసి అందులో కొబ్బరి నీళ్లు పోస్తాడు. ఆ తర్వాత స్ట్రా కూడా ఇచ్చేస్తాడు. భలే బాగుందంటూ టేస్ట్ చేయడం చూడవచ్చు. " 100 రూపాయలకు ఇలాంటి వింత ఫుడ్ కొన్నట్లు వ్లోగర్ చెబుతున్నాడు. ఈ రీల్ పోస్ట్ చేసిన దగ్గరకు 30 లక్షల మందికి పైగా చూశారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దృష్టిని కూడా ఈ వీడియో ఆకర్షించింది. "మేము చిప్స్, కొబ్బరి నీళ్లు రెండింటినీ డెలివరీ చేస్తాము. దయచేసి ఇవన్నీ చేయకండి" అంటూ వారు కామెంట్ చేయడం విశేషం. "కొబ్బరి నీళ్ళకి న్యాయం కావాలి", "లేస్, కొబ్బరి నీళ్లను చూస్తే నాకు బాధగా ఉంది", "ఓ మై గాడ్, ప్రజలు ఇలా తింటున్నారని/తాగుతున్నారని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను... ఇదేం పిచ్చి. RIP ఆరోగ్యకరమైన పానీయం", "ఉన్న ఒకే ఒక్క నేచురల్ డ్రింక్ అనారోగ్యకరంగా మార్చేశారే" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read Also: Optical Illusion Test: మీది డేగ చూపు అయితే.. ఇసుకలో దాక్కున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి
Viral Marriage Wishlist: వరుడి కోసం అమ్మాయి షాకింగ్ డిమాండ్లు.. క్రేజీ రూల్స్ లిస్ట్ వైరల్..