Share News

Viral Video: అదృష్టవంతుడివి బ్రో.. లేదంటేనా..

ABN , Publish Date - Jan 03 , 2025 | 05:32 PM

తమిళనాడులో అందరినీ ఆశ్చర్యపరిచే ఓ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

Viral Video: అదృష్టవంతుడివి బ్రో.. లేదంటేనా..

Viral Video: తమిళనాడులో అందరినీ ఆశ్చర్యపరిచే ఓ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. పట్టుకొట్టాయ్‌లో రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఓ వ్యక్తి ఇరుక్కుపోయాడు. వెంటనే గమనించిన డ్రైవర్ బస్సును ఆపి చూసాడు. అయితే, అదృష్టవశాత్తు అతనికి ఒంటిపై ఎలాంటి గాయాలు కాలేదు. ఆ తరువాత అక్కడి నుంచి లేచి తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.


ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. లక్కీ మ్యాన్‌ అని కొందరు కామెంట్స్ చేయగా.. మరికొందరు అదృష్టవంతుడివి బ్రో.. మీ జాతకం ఈ రోజు బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం బస్సు డ్రైవర్ పై విరుచుకుపడుతున్నారు. అతడి ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఆ వ్యక్తికి ఏదైన జరిగి ఉంటే అతడి కుటుంబ పరిస్థితి ఏంటి? అధికారులు ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

అయితే, మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మనిషి తిరిగి సేఫ్ గా ఇంటికి వచ్చే వరకు ప్రాణానికి గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నా అనుకోని సంఘటనల వల్ల ప్రాణాలు కోల్పోతారు.

Updated Date - Jan 03 , 2025 | 05:57 PM