Share News

Viral Video: ఇది మహా పాపం.. రెస్టారెంట్ కిచెన్‌లో వీళ్లు ఏం చేస్తున్నారో చూడండి.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN , Publish Date - Jan 05 , 2025 | 05:14 PM

కనీసం వారానికి ఒకసారైనా రెస్టారెంట్లో భోజనం చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. వారిని ఆదరించే రెస్టారెంట్ల సంఖ్యగా కూడా పెరుగుతోంది. అయితే తమను నమ్మి వస్తున్న వినియోగదారులకు నాణ్యమైన భోజనం అందిస్తున్న వారి సంఖ్య చాలా అంటే చాలా తక్కువగా ఉందని చెప్పక తప్పదు.

Viral Video: ఇది మహా పాపం.. రెస్టారెంట్ కిచెన్‌లో వీళ్లు ఏం చేస్తున్నారో చూడండి.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
Restaurant Kitchen

ప్రస్తుతం మహా నగరాల్లోనే కాదు.. చిన్న చిన్న పట్టణాల్లో కూడా రెస్టారెంట్ (Restaurant) కల్చర్ విపరీతంగా పెరిగింది. కనీసం వారానికి ఒకసారైనా రెస్టారెంట్లో భోజనం చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. వారిని ఆదరించే రెస్టారెంట్ల సంఖ్యగా కూడా పెరుగుతోంది. అయితే తమను నమ్మి వస్తున్న వినియోగదారులకు నాణ్యమైన భోజనం అందిస్తున్న వారి సంఖ్య చాలా అంటే చాలా తక్కువగా ఉందని చెప్పక తప్పదు. డైనింగ్ హాల్‌ను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్న యజమానులు అసలైన వంటి గదిని (Restaurant Kitchen) మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు (Viral Video).


ఎంతో అపరిశుభ్ర వాతావరణంలో తయారైన ఆహారాన్ని అందంగా ప్లేట్‌లలో తెచ్చి వడ్డించేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని సిబ్బందిని చూస్తే రెస్టారెంట్‌కు వెళ్లాలంటేనే భయమేస్తుంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలు వంట గదిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయినవి. ముందుగా ఓ వ్యక్తి రెస్టారెంట్ సింక్‌లో కుక్క పిల్లకు స్నానం చేయిస్తున్నాడు. పక్కనే వంట సిద్ధమవుతుంది. అలాగే మరో వ్యక్తి ఫ్లోర్‌ను ఊడుస్తున్న మాఫ్ స్టిక్‌తోనే పొయ్యి మీద వండుతున్న ఆహార పదార్థాలను కలిపేస్తున్నాడు. ఆ రెండు ఒకే రెస్టారెంట్‌కు సంబంధించినవా? లేదా వేర్వేరు రెస్టారెంట్లవా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.


ఇది పాత వీడియోనే అయినప్పటికీ ప్రస్తుతం మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``ఆ రెస్టారెంట్ కిచెన్‌లో సీసీటీవీ ఉంది కాబట్టి.. అవి బయటకు వచ్చాయి. చాలా మంది తమ కిచెన్‌లలో సీసీటీవీ పెట్టి స్టాఫ్ ఏం చేస్తున్నారో కూడా చూడరు``, ``ఇంట్లో వండుకున్న వంట ఎంతో ఉత్తమం``, ``ఇది మహా పాపం``, ``చాలా రెస్టారెంట్లలో పరిస్థితి ఇదే``, ``ఈ వీడియోను ఏఐ సహాయంతో రూపొందించి ఉంటారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral News: ఏడడుగులు వేసే ముందు బాత్రూమ్‌కు వెళ్లిన వధువు.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో..

Panipuri Vendor: వామ్మో.. పానీపూరీ అమ్ముతూ అంత సంపాదిస్తున్నాడా? అతడి ఆదాయం ఎంతో తెలిస్తే కళ్లు తేలియ్యాల్సిందే..


Viral Video: అమ్మా.. వస్తున్నా ఆగు.. తల్లిపై సింహం పిల్ల ఎలా కోపం ప్రదర్శిస్తోందో చూడండి..


Brain Teaser Test: మీరు బాగా అనలైజ్ చేస్తారా? అయితే ఈ ముగ్గురిలో దొంగ ఎవరో 7 సెకెన్లలో గుర్తించండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 05 , 2025 | 05:14 PM