Viral Video: భారతీయులకే ఇలాంటి టెక్నిక్ సాధ్యం.. బ్లాంకెట్‌కు కవర్ ఎలా తొడిగిందో చూడండి..
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:03 PM
ఎంత కష్టమైన పనినైనా తెలివితేటలతో సులభంగా పూర్తి చేయవచ్చు. అలాంటి ఉపాయాలు వేయడంలో భారతీయులను మించిన వారు ఎవరూ లేరు. ఎంతకష్టమైన పనినైనా వారు సులభంగా పూర్తి చేయగలరు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బ్రెయిన్ ఉపయోగిస్తే స్ట్రెయిన్ తగ్గుతుంది. ఎంత కష్టమైన పనినైనా తెలివితేటలతో సులభంగా పూర్తి చేయవచ్చు. అలాంటి ఉపాయాలు (Tricks) వేయడంలో భారతీయులను మించిన వారు ఎవరూ లేరు. ఎంతకష్టమైన పనినైనా వారు సులభంగా పూర్తి చేయగలరు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా అలాంటిదే మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ మహిళ చాలా సులభంగా బ్లాంకెట్ (Blanket)కు కవర్ వేసింది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
@HasnaZaruriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన కొడుకు సహాయంతో చాలా సులభంగా బ్లాంకెట్‌కు కవర్ తొడిగేసింది. చలి నుంచి కాపాడే క్విల్ట్ లేదా బ్లాంకెట్‌కు చాలా మంది వేరే వస్త్రంతో కవర్ లాంటిది తొడుగుతారు. చాలా భారీగా ఉండే బ్లాంకెట్‌లకు కవర్లు తొడగడం చాలా కష్టమైన పని. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు బ్లాంకెట్‌ను పట్టుకుని నిల్చుంటే ఓ మహిళ ఓ వెరైటీ టెక్నిక్‌తో సెకెన్ల వ్యవధిలో కవర్ తొడిగేసింది. ఆ టెక్నిక్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 6.6 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 17 వందల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ``ఆమె టెక్నిక్ చూస్తుంటే ఆమె బీహార్‌కు చెందినదై ఉంటుంది``, ``భారతీయ మహిళలకు ఇది చాలా చిన్న విషయం``, ``మన దేశంలో ప్రతి దానికీ ఓ టెక్నిక్ ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. ఏనుగులకు కోపం వస్తే ఇలా ఉంటుందా? ఎలా దాడి చేస్తున్నాయో చూడండి..
Viral: వావ్.. చిన్న స్థలంలో అంత పెద్ద ఇల్లా? ఆ ప్లానింగ్ ఇచ్చిన వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Viral Video: ఇతడి టేస్ట్‌కు సలాం కొట్టాల్సిందే.. టీతో ఎవరైనా దానిని తింటారా? వీడియో చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి