Viral Video: వామ్మో.. ఇలా కూడా దొంగతనం చేస్తారా? రైలు ప్లాట్‌ఫామ్‌పై ఓ చిరు వర్తకుడికి ఎలాంటి పరిస్థితి ఎదురైందో చూడండి..
ABN , Publish Date - Jan 14 , 2025 | 09:00 AM
ఈ వీడియను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను దాదాపు ఏడు లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. 68 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పాపం.. అతడి చేతిలోని ప్రిమియం షర్టు పోయిందే``, ``నిర్లక్ష్యానికి ఫలితం ఇదే``, ``ఇది స్క్రిప్టు ప్రకారం జరిగినట్టు అనిపిస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్‌లలో దొంగతనాలు (Theft) ఎక్కువగా జరుగుతుంటాయి. కిక్కిరిసిపోయిన జనంతో దొంగలు కలిసిపోయి అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి సమయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే దోపిడీకి గురికాక తప్పదు. తాజాగా ఓ యువకుడికి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై (Railway station) విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ కుర్రాడు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి బట్టలు అమ్మకానికి సంబంధించిన ప్రచారం చేస్తున్నాడు. ఆ సమయంలో అతడికి అనూహ్య అనుభవం ఎదరైంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
@sarcasticschool అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడు రైల్వే ప్లాట్‌ఫామ్ మీద నిలబడి తను విక్రయించబోతున్న బట్టలకు సంబంధించి ఓ వీడియోను రూపొందిస్తున్నాడు. వేరే వ్యక్తి అతడు చెబుతున్న దానిని వీడియో తీస్తున్నాడు. ఆ సమయంలో ఆ స్టేషన్ నుంచి ఓ లోకల్ ట్రైన్ బయల్దేరుతోంది. ఆ రైలు డోర్ దగ్గర నిల్చున్న ఓ వ్యక్తి ఈ కుర్రాడి చేతిలోని షర్టులను లాగేసుకున్నాడు. మరో భోగీలో ఉన్న వ్యక్తి మిగిలిన షర్టులను లాగేసుకున్నాడు. షాకైన ఆ కుర్రాడు తన బట్టల కోసం లోకల్ రైలు వెంబడి పరిగెత్తాడుం కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. రైలు వేగంగా వెళ్లిపోయింది.
ఈ వీడియను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను దాదాపు ఏడు లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. 68 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పాపం.. అతడి చేతిలోని ప్రిమియం షర్టు పోయిందే``, ``నిర్లక్ష్యానికి ఫలితం ఇదే``, ``ఇది స్క్రిప్టు ప్రకారం జరిగినట్టు అనిపిస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: మీరు సోయా చాప్స్‌ను ఇష్టంగా తింటారా? ఈ వీడియో చూస్తే ఇక వాటి జోలికి వెళ్లరేమో..
Optical Illusion Test: మీ కళ్ల పవర్ ఏ రేంజ్‌లో ఉంది?.. బొమ్మల మధ్యన నిజమైన గుడ్లగూబ ఎక్కడుంది..
Anand Mahindra: ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. 90 గంటల పని విధానంపై ఆనంద్ మహీంద్రా విసుర్లు..
Teacher`s Whisky: టీచర్స్ విస్కీకి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? దాని వెనుకున్న 175 ఏళ్ల చరిత్ర ఏంటంటే..
Viral Video: స్వర్గంలో ప్రయాణం.. 4 వేల కి.మీ. జర్నీ.. రూ. 1.5 లక్షల టిక్కెట్.. ఎక్కడో తెలుసా?
Optical Illusion Test: వర్షం పడుతోంది.. ఈ పిల్లల గొడుగు ఎక్కడుందో 5 సెకెన్లలో గుర్తించి చెప్పండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి