Viral Video: వామ్మో.. ఈ కుక్క చాలా డేంజర్.. తనను ఢీకొన్న కారుపై ఎలా పగ తీర్చుకుంటోందో చూడండి..
ABN , Publish Date - Jan 21 , 2025 | 03:23 PM
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే జంతువులు కూడా ప్రతీకారంతో రగిలిపోతాయని నమ్మక తప్పదు. ఆ వీడియోలో ఓ కుక్క చేసిన పని చాలా మందికి షాక్ కలిగిస్తోంది. సీసీటీవీ రికార్డు చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా మనుషుల్లోనే ప్రతికార వాంఛ (Revenge) ఎక్కువగా ఉంటుంది అంటారు. తనకు హాని చేసిన వారికి తిరిగి హాని చేయాలనే భావం మనుషుల్లోనే ఎక్కువగా ఉంటుంది. జంతువుల్లో పగలు, ప్రతీకారాలు ఉండవు. పాములు పగబడతాయని అంటారు కానీ, అందులో నిజమెంతో ఎలాంటి రుజువూ లేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే జంతువులు కూడా ప్రతీకారంతో రగిలిపోతాయని నమ్మక తప్పదు. ఆ వీడియోలో ఓ కుక్క (Dog) చేసిన పని చాలా మందికి షాక్ కలిగిస్తోంది. సీసీటీవీ రికార్డు చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఇంటి ముందు బ్లాక్ కారు పార్క్ చేసింది. రాత్రి 2 గంటల సమయంలో ఓ కుక్క ఆ కారు దగ్గరకు వచ్చి తన ముందరి కాళ్లతో దానిపై గీతలు గీస్తోంది. ఆ తర్వాత పక్కకు వచ్చి కారును పరిశీలిస్తోంది. కారు యజమాని అయిన ప్రహ్లాద్ సింగ్ ఘోషి జనవరి 17న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఇంటి నుంచి బయలుదేరాడు. అతడి ఇంటి నుంచి అర కిలోమీటర్ దూరంలోని కాలనీలోని మలుపు వద్ద కూర్చున్న నల్ల కుక్కను కారు ఢీకొట్టింది. దీంతో ఆ కుక్క మొరుగుతూ చాలా దూరం కారు వెనుక పరుగెత్తింది.
రాత్రి ఒంటి గంటకు ప్రహ్లాద్ పెళ్లి నుంచి తిరిగి వచ్చి ఇంటి ముందు కార్ పార్క్ చేశాడు. ఉదయం లేచి చూసే సరికి కారు నిండా గీతలు ఉన్నాయి. చుట్టు పక్కల పిల్లలు ఆ పని చేశారనుకుని సీసీటీవీ చూస్తే కుక్క గీతలు పెడుతూ కనిపించింది. కుక్క అలా ఎందుకు చేసిందో ముందు ప్రహ్లాద్‌కు అర్థం కాలేదు. చివరకు ముందు రోజు తన కారు కింద పడిన కుక్క అదేనని ప్రహ్లాద్‌కు గుర్తుకు వచ్చింది. మొత్తం మీద కుక్కలు కూడా అలా పగతీర్చుకుంటాయని తెలుసుకుని షాకయ్యాడు.
ఇవి కూడా చదవండి..
Penguin Love Life: పెంగ్విన్‌లలో కూడా ప్రేమ, మోసం, విడాకులు.. వెలుగులోకి ఆశ్చర్యకర నిజాలు..
Anand Mahindra: ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. 90 గంటల పని విధానంపై ఆనంద్ మహీంద్రా విసుర్లు..
Teacher`s Whisky: టీచర్స్ విస్కీకి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? దాని వెనుకున్న 175 ఏళ్ల చరిత్ర ఏంటంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి