Share News

Bride Viral Video: పెళ్లిలో అందరి ముందు ఆ ప్రశ్న అడిగిన వధువు.. వరుడు చేతిలో జోడించి ఏం చెప్పాడంటే..

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:13 PM

భార్యాభర్తలు ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటేనే కాపురం సజావుగా సాగుతుంది. లేకపోతే కొన్నేళ్లకే ఆ పెళ్లి విడాకులకు దారి తీస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పెళ్లి వీడియో వైరల్ అవుతోంది.

Bride Viral Video: పెళ్లిలో అందరి ముందు ఆ ప్రశ్న అడిగిన వధువు.. వరుడు చేతిలో జోడించి ఏం చెప్పాడంటే..
Bride and groom

పెళ్లంటే (Wedding) నూరేళ్ల పంట అంటారు. పెళ్లితో ఎవరి జీవితంలోనైనా నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది. వేరే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. ఆ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటేనే కాపురం సజావుగా సాగుతుంది. లేకపోతే కొన్నేళ్లకే ఆ పెళ్లి విడాకులకు దారి తీస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పెళ్లి వీడియో (Wedding Video) వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో పెళ్లి అనంతరం వధువు (Bride) అడిగిన ప్రశ్న అందరికీ నవ్వు తెప్పించింది. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది.


bunkstopstyling అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వధూవరులు పెళ్లి వేదిక మీద కూర్చుని ఉన్నారు. వారి చుట్టూ అతిథులు, బంధువులు నిలబడి ఉన్నారు. ఆ సమయంలో వధువు వరుడిని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అని అడిగింది. ఆ ప్రశ్నకు వరుడు స్పందిస్తూ.. కొంచెం సిగ్గుపడండి, ఇప్పటికే పెళ్లి అయిపోయింది అని చెప్పాడు. ఆ సమాధనంతో వధువుతో పాటు అందరూ నవ్వుకున్నారు. ఆ తరువాత కూడా వధువు మళ్లీ అదే ప్రశ్న అడిగింది. ఈసారి వరుడు స్పందిస్తూ.. తల దించుకుని చేతులు జోడించి దండం పెట్టాడు.


ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.3 కోట్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 6.7 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ ప్రశ్న అడిగే సమయం మించిపోయింది``, ``పెళ్లి అయిపోయింది కదా.. ప్రేమించకపోతే ఏం చేస్తాడు`` అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Wife and Husband: అక్కడక్కడ ఇలాంటి మంచి భార్యలు కూడా ఉంటారు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు చూస్తే..


Snake Viral Video: వామ్మో.. ఇది మామూలు ఫైట్ కాదు.. పాముల పోరాటం ఇంత భయంకరంగా ఉంటుందా?


Optical Illusion: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ పుస్తకాల మధ్య తాళం చెవిని 5 సెకెన్లలో కనుగొనండి..


Optical Illusion: మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో ``HOT`` పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 26 , 2025 | 05:13 PM