Viral Video: ఈ ఏనుగు ఎంత మంచిది.. ఎన్‌క్లోజర్‌లో కుర్రాడి చెప్పు పడిపోతే ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - Jan 07 , 2025 | 10:01 AM
ఇతర జంతువులతో పోల్చుకుంటే ఏనుగులు చాలా ప్రశాంతంగా, హుందాగా ప్రవర్తిస్తాయి. వాటికి జాలి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ కారణాలతో ఏనుగులు మనుషులకు మచ్చిక అవుతాయి. అనవసరంగా ఇతరులకు హాని కలిగించేందుకు ప్రయత్నించవు.
ఈ భూమి మీద ఏనుగులు (Elephants) చాలా తెలివైన జంతువులు. అంతేకాదు ఇతర జంతువులతో పోల్చుకుంటే ఏనుగులు చాలా ప్రశాంతంగా, హుందాగా ప్రవర్తిస్తాయి. వాటికి జాలి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ కారణాలతో ఏనుగులు మనుషులకు మచ్చిక అవుతాయి. అనవసరంగా ఇతరులకు హాని కలిగించేందుకు ప్రయత్నించవు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు (Elephant Videos) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ఎక్స్ ఖాతా @susantananda3లో ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. జూలోని ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఏనుగును చూసేందుకు చాలా మంది వెళ్లారు. ఆ సమయంలో ఓ కుర్రాడి చెప్పు (kid's shoe) ఏనుగు ఉన్న ఎన్‌క్లోజర్‌లో పడిపోయింది. దీంతో ఆ ఏనుగు అక్కడకు వచ్చి ఆ చెప్పును తన తొండంతో తీసి ఆ కుర్రాడికి అందించింది. ఆ ఏనుగు ప్రవర్తన అక్కడున్న వారందరికీ ఎంతో సంతోషం కలిగించింది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఎన్నో వేల మంది ఈ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి దానిపై తమ స్పందనలను తెలియజేశారు. ``ఏనుగులను అలాంటి చిన్న ప్రదేశాల్లో బంధించి ఉండడం అత్యంత అమానవీయం``, ``ఏనుగుది గొప్ప మనసు.. మనుషులది క్రూరత్వం``, ``చాలా జంతువులు చిన్న పిల్లలతో చాలా దయగా ప్రవర్తిస్తాయి```, ``జంతువుల నుంచి మనుషులు ఎన్నో విషయాలు నేర్చుకోవాలి`` అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Brain Teaser Test: మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మూడు తప్పులను 9 సెకెన్లలో గుర్తించండి..
Viral Video: ఇతడి టేస్ట్‌కు సలాం కొట్టాల్సిందే.. టీతో ఎవరైనా దానిని తింటారా? వీడియో చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి