Viral Video: వామ్మో.. ఏనుగులకు కోపం వస్తే ఇలా ఉంటుందా? ఎలా దాడి చేస్తున్నాయో చూడండి..
ABN , Publish Date - Jan 06 , 2025 | 09:47 AM
ఏనుగుకు కోపం వస్తే సింహాలు, పులులు కూడా తోక ముడవాల్సిందే. ప్రస్తుతం రోడ్లు వేయడం కోసం అడవులు కొట్టేస్తుండడంతో ఏనుగులకు ఆహారం, ఆవాసం దొరకడం లేదు. దీంతో అవి ఆహారం కోసం జనావాసాల వైపు వస్తూ దాడికి పాల్పడుతున్నాయి.
ఏనుగు (Elephant) చాలా ప్రశాంతమైన జంతువు. అనవసరంగా ఇతర జంతువుల జోలికి వెళ్లదు. మనుషులకు కూడా చాలా మచ్చిక అవుతుంది. చాలా సన్నిహితంగా మెలుగుతుంది. అయితే ఏనుగుకు ఆగ్రహం వచ్చిందంటే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఏనుగుకు కోపం వస్తే సింహాలు, పులులు కూడా తోక ముడవాల్సిందే. ప్రస్తుతం రోడ్లు వేయడం కోసం అడవులు కొట్టేస్తుండడంతో ఏనుగులకు ఆహారం, ఆవాసం దొరకడం లేదు. దీంతో అవి ఆహారం కోసం జనావాసాల వైపు వస్తూ దాడికి పాల్పడుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
mood_off_istory అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొన్ని ఏనుగులు ఓ గ్రామంలోకి చొరబడ్డాయి. బలంగా ఘీంకరిస్తూ భయపెడుతున్నాయి. అవి ఆ గ్రామం దాటి వెళ్లిపోయే హడావుడిలో ఉన్నాయి. అడ్డు వచ్చిన వారిపై దాడికి తెగబడుతున్నాయి. పాకలను కూలగొడుతున్నాయి. ఆ ఏనుగులను చూసి ఆవులు, గేదెలు భయంతో పారిపోయాయి. మనుషులు ఇళ్లలోకి వెళ్లిపోయి తలుపులు వేసుకున్నారు. ఓ వ్యక్తి ఇంటి మేడ మీదకు వెళ్లి ఆ ఏనుగుల బీభత్సాన్ని వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు పది లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 1.18 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆస్తి నష్టం జరిగింది, కానీ అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు``, ``అడవులను ఆక్రమిస్తే జరిగేది అదే``, ``ఏనుగులు జనావాసాల వైపు రాలేదు.. మనుషులే అడవుల్లో పాకలు వేసుకున్నారు``, ``ఆ ఏనుగులు కోపంగా లేవు.. భయపడుతున్నాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: వావ్.. చిన్న స్థలంలో అంత పెద్ద ఇల్లా? ఆ ప్లానింగ్ ఇచ్చిన వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Viral Video: ఇతడి టేస్ట్‌కు సలాం కొట్టాల్సిందే.. టీతో ఎవరైనా దానిని తింటారా? వీడియో చూస్తే..
Viral News: ఏడడుగులు వేసే ముందు బాత్రూమ్‌కు వెళ్లిన వధువు.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి