Share News

Viral Video: హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా తగ్గేదే లే.. ఈ బామ్మ తీరు చూస్తే నవ్వాపుకోలేం..

ABN , Publish Date - Jan 02 , 2025 | 06:17 PM

చిన్న అమ్మాయిల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు చాలా మంది మహిళల మేకప్‌ విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మహిళలకు, మేకప్‌నకు మధ్యనున్న అవినాభావ సంబంధం అర్థమవుతుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Viral Video: హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా తగ్గేదే లే.. ఈ బామ్మ తీరు చూస్తే నవ్వాపుకోలేం..
Old woman is doing her makeup while lying on the bed

చాలా మంది మహిళలు మేకప్‌ (Makeup)ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మేకప్ లేకుండా బయటకు రాని వారు ఎందరో ఉంటారు. చిన్న అమ్మాయిల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు చాలా మంది మహిళల మేకప్‌ విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మహిళలకు, మేకప్‌నకు మధ్యనున్న అవినాభావ సంబంధం అర్థమవుతుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన వారు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు (Viral Video).


@BaissaRathore1 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. హాస్పిటల్ బెడ్‌పై వృద్ధురాలు (Old Woman) పడుకుని ఉంది. ఆమె ముక్కులో పైపు కూడా ఉంది. అయినప్పటికీ, ఆమె తన అభిరుచుల విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. హాస్పిటల్ బెడ్‌పై పడుకుని మేకప్ చేసుకుంటుండడం వీడియోలో కనిపిస్తోంది. ఆమె లిప్‌స్టిక్, బ్లష్, ఇతర మేకప్‌లు వేసుకుంటోంది. ఓ వ్యక్తి ఆ బామ్మ తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఏ పరిస్థితిలోనైనా సానుకూలంగా ఉండాలనేది గొప్ప విషయం``, ``వయసు కాదు.. మనసే ముఖ్యం``, ``కొందరికి వయసు అనేది నెంబర్ మాత్రమే``, ``ఆమె పాజిటివ్ ఆటిట్యూడ్ చాలా గొప్పగా ఉంది``, ``ఆందోళన నుంచి బయటపడడం ఎలాగో ఆమె నేర్పుతోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పాపం.. అర్జెంటుగా వెళ్లాలనుకుంది.. చివరకు అనుకోని ఇబ్బందికి గురైంది.. వీడియో వైరల్..


Viral Video: బాబూ.. ఇదేం పని.. ఈ వ్యక్తి రైల్లో ఏం చేస్తున్నాడో చూడండి.. సీట్ కవర్లను చింపేస్తూ..


Optical Illusion Test: పాపం.. ఈమెకు తన భర్త కనబడడం లేదు.. 20 సెకెన్లలో వెతికి పెట్టండి..


Viral Video: వామ్మో.. ప్రమాదం కూడా ఇతడిని చూస్తే భయపడుతుందేమో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Jan 02 , 2025 | 06:17 PM