Share News

Viral Video: ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు.. లాస్ట్ ఫుడ్.. కోకా-కోలాతో ఎగ్ బుర్జి ఎలా చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:23 AM

ఫుడ్ రెసిపీలు, విచిత్రమైన కాంబినేషన్‌లో వంటకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వైరల్ అయ్యేందుకే కొందరు ఊహకు కూడా అందని ఆహార పదార్థాలను తయారు చేసి వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Viral Video: ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు.. లాస్ట్ ఫుడ్.. కోకా-కోలాతో ఎగ్ బుర్జి ఎలా చేస్తున్నాడో చూడండి..
egg bhurji with Coca-Cola

ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా హవా కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని విచిత్రంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫుడ్ రెసిపీలు, విచిత్రమైన కాంబినేషన్‌లో వంటకాలకు సంబంధించిన వీడియోలు (Food Videos) బాగా వైరల్ అవుతున్నాయి. వైరల్ అయ్యేందుకే కొందరు ఊహకు కూడా అందని ఆహార పదార్థాలను తయారు చేసి వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు (Viral Video).


తాజాగా ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో విచిత్రంగా ఎగ్ బుర్జీ తయారు చేస్తున్న వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. @HumansNoContext అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఫుడ్ స్టాల్ దగ్గర ఓ వ్యక్తి ఎగ్‌బుర్జీ (egg bhurji) తయారు చేస్తున్నాడు. ముందుగా పెనంలో కోకా-కోలా వేస్తున్నాడు. ఆ కోకా-కోలా ద్రవం మరుగుతుండగా అందులో మూడు గుడ్లను పగలగొట్టి వేశాడు. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటా, పచ్చి మిర్చి ముక్కలను వేశాడు. ఆ తర్వాత దానిపై సాస్ వేసి బాగా కలిపి ఆకులో వేసి ఇచ్చేస్తున్నాడు. ఆ వెరైటీ ఎగ్ బుర్జీ రెసిపీని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు (egg bhurji with Coca-Cola).


ఆ కోకా-కోలా ఎగ్ బుర్జీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 16 లక్షల మందికి పైగా వీక్షించారు. 6.6 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``దాని టేస్ట్ ఎలా ఉంటుంది``, ``దీనిని తింటే.. తర్వాత ఇంకేం తినలేరు``, ``దీని కంటే విషం తీసుకోవడం ఉత్తమం``, ``ఇది కేవలం సోషల్ మీడియా కోసమే రూపొందించారా? నిజంగా అలాంటి ఎగ్ బుర్జీని తినేవాళ్లు కూడా ఉన్నారా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: తమ్ముడూ.. చలి కాదు, తేడా వస్తే ప్రాణాలే పోతాయ్.. వైరల్ వీడియోపై నెటిజన్ల స్పందన..


Brain Teaser Test: మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ టీచర్లు ఇద్దరిలో ఎవరు పేదవారో 5 సెకెన్లలో గుర్తించండి..


Electricity Bill: కరెంట్ బిల్లు చూసి షాక్.. ఏకంగా రూ.200 కోట్లు రావడంతో యజమాని పరిస్థితి ఏంటంటే..


Artificial Intelligence: ఏఐ ఏం చేయగలదో చూడండి.. ఓ వ్యక్తి నిద్రపోతున్న సమయంలో ఏం జరిగిందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 11 , 2025 | 11:23 AM