Share News

Viral Video: పాపం.. అర్జెంటుగా వెళ్లాలనుకుంది.. చివరకు అనుకోని ఇబ్బందికి గురైంది.. వీడియో వైరల్..

ABN , Publish Date - Jan 02 , 2025 | 06:03 PM

రోడ్డు మీద నడిచేటపుడు అర్జెంట్‌గా వెళ్లిపోవాలనుకుంటే లేని పోని సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఎవరికైనా పై విషయం అర్థమవుతుంది. ఆ వీడియోలో ఓ మహిళ అర్జెంట్‌గా ఇంటికి వెళ్లిపోవాలనుకుని ప్రమాదానికి గురైంది.

Viral Video: పాపం.. అర్జెంటుగా వెళ్లాలనుకుంది.. చివరకు అనుకోని ఇబ్బందికి గురైంది.. వీడియో వైరల్..
Funny viral Video

ప్రకృతి విపత్తుల సమయంలోనూ, రోడ్ల మీద నడిచేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచి తూచి అడుగులు వేయాలి. లేకపోతే మూల్యం చెల్లించక తప్పదు. ఎదుటి వారిని చూసిన తర్వాతైనా కాస్త జాగ్రత్త పడాలి. అర్జెంట్‌గా వెళ్లిపోవాలనుకుంటే లేని పోని సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఎవరికైనా పై విషయం అర్థమవుతుంది. ఆ వీడియోలో ఓ మహిళ అర్జెంట్‌గా ఇంటికి వెళ్లిపోవాలనుకుని ప్రమాదానికి గురైంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


@introvert_hu_ji అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డంతా నీటితో నిండి ఉంది. ఓ వ్యక్తి గట్టు మీద నిలబడి నీటి లోతును చెక్ చేస్తున్నాడు. ముందుగా సైకిల్ పెట్టి చూస్తున్నాడు. ఆ సమయంలో ఓ మహిళ అక్కడకు వేగంగా వచ్చింది. అతడిని తప్పించుకుని ముందుకు వెళ్లిపోయింది. అయితే ముందు గట్టు లేకపోవడంతో జారిపోయి నీటిలో పడిపోయింది. దీంతో ఆమె డ్రెస్ అంతా బురదతో నిండిపోయింది. ఇక, చేసేది లేక ఆమె మోకాలు లోతో బురద నీటిలోనే నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 47 వేల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అక్క చాలా తొందరపడింది``, ``ఇలాంటి పరిస్థితిల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి``, ``ఆవిడ అర్జెన్సీ ఏంటో మనకు తెలియదు కదా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: బాబూ.. ఇదేం పని.. ఈ వ్యక్తి రైల్లో ఏం చేస్తున్నాడో చూడండి.. సీట్ కవర్లను చింపేస్తూ..


Optical Illusion Test: పాపం.. ఈమెకు తన భర్త కనబడడం లేదు.. 20 సెకెన్లలో వెతికి పెట్టండి..


Viral Video: వామ్మో.. ప్రమాదం కూడా ఇతడిని చూస్తే భయపడుతుందేమో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చూడండి..


Viral Video: కోట్లు విలువ చేసే కారు.. ఎడ్లబండి సహాయం లేకపోతే బయటకు రాలేకపోయింది.. వీడియో వైరల్..



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 02 , 2025 | 06:03 PM