Viral Video: డబ్బులను ఇలా కూడా కౌంట్ చేయవచ్చా.. నోట్ల కట్టలను ఎలా తూకం వేస్తున్నారో చూడండి..
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:51 PM
డబ్బులను వేగంగా లెక్కించడానికి ఉపయోగపడే కౌంటింగ్ మెషిన్‌లు అందరికీ అందుబాటులో ఉండవు. ఎక్కువ శాతం బ్యాంక్‌ల్లోనూ, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లోనూ మాత్రమే కౌంటింగ్ మెషిన్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి డబ్బులు లెక్క పెట్టేందుకు ఓ వినూత్న మార్గం ఎంచుకున్నాడు.
సాధారణంగా ఎవరైనా డబ్బులు (Money) లెక్క పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకటికి రెండు సార్లు సరి చూసుకుంటారు (Money counting). కౌంటింగ్ మెషిన్‌లు (counting machines) అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటితోనే చాలా వేగంగా లెక్క పెట్టేస్తున్నారు. అయితే ఆ కౌంటింగ్ మెషిన్‌లు అందరికీ అందుబాటులో ఉండవు. ఎక్కువ శాతం బ్యాంక్‌ల్లోనూ, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లోనూ మాత్రమే కౌంటింగ్ మెషిన్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి డబ్బులు లెక్క పెట్టేందుకు ఓ వినూత్న మార్గం (New Technique) ఎంచుకున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
@Bindasbalak అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఓ సంచిలో డబ్బు కట్టలను తీసుకొచ్చి టేబుల్‌పై పెడుతున్నాడు. మరో ఆ టేబుల్‌పై ఉన్న వెయింగ్ మెషిన్ (Weighing machine)తో ఆ డబ్బు కట్టల బరువును చూస్తున్నాడు. రూ.500 నోట్ల కట్ట బరువును చూసి లోపల పెట్టుకున్నాడు. వెయింగ్ మెషిన్ మీద పెట్టిన రూ.500 నోట్ల కట్ట ప్రతీది కచ్చితంగా .95 గ్రాముల బరువును చూపిస్తోంది. దీంతో ఆ వ్యక్తి ఆ నోట్ల కట్టలు సరిగ్గానే ఉన్నట్టు భావించి తీసుకుంటున్నాడు. ఆ సరికొత్త లెక్కింపు విధానాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను వేల మంది వీక్షించి, వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బరువు ఆధారంగా కూడా డబ్బులను లెక్కించవచ్చా``, ``అన్ని సమయాల్లోనూ ఇలా లెక్కించడం మంచిది కాదు``, ``ఈ కొత్త పద్ధతి బాగుంది``, ``ఇది నమ్మదగిన పద్ధతి కాదేమో``, ``అతడు తన బ్రెయిన్‌కు కరెక్ట్‌గా వాడుతున్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: భారతీయులకే ఇలాంటి టెక్నిక్ సాధ్యం.. బ్లాంకెట్‌కు కవర్ ఎలా తొడిగిందో చూడండి..
Viral Video: వామ్మో.. ఏనుగులకు కోపం వస్తే ఇలా ఉంటుందా? ఎలా దాడి చేస్తున్నాయో చూడండి..
Viral: వావ్.. చిన్న స్థలంలో అంత పెద్ద ఇల్లా? ఆ ప్లానింగ్ ఇచ్చిన వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Viral Video: ఇతడి టేస్ట్‌కు సలాం కొట్టాల్సిందే.. టీతో ఎవరైనా దానిని తింటారా? వీడియో చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి