Viral Video: మన దేశంలో ఏదైనా సాధ్యమే.. ఆ కొబ్బరి చెట్టును చూస్తే షాక్‌తో కళ్లు తేలెయ్యాల్సిందే..
ABN , Publish Date - Jan 14 , 2025 | 01:49 PM
మన దేశంలో నిపుణులే కాదు.. సాధారణ వ్యక్తులు, ఇంటికే పరిమితమైన గృహిణులు కూడా తమ తెలివితేటలతో అబ్బురపరుస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మన దేశంలో చాలా మంది కష్టసాధ్యమైన పనులకు సులభమైన పరిష్కారాలను కనుగొంటారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పనిని సులభంగా పూర్తి చేస్తారు. నిపుణులే కాదు.. సాధారణ వ్యక్తులు, ఇంటికే పరిమితమైన గృహిణులు కూడా తమ తెలివితేటలతో అబ్బురపరుస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఎన్నో వీడియోలు (Jugaad Videos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో జుగాడ్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం (Viral Video).
@veejuparmar అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను గుర్గావ్ (Gurgaon)లో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి ఎక్కడికో కారులో వెళుతున్నాడు. దారిలో అతను ఇంతకు ముందెన్నడూ చూడనిది చూశాడు. అదేంటంటే.. ఓ చోట కొబ్బరి చెట్టు (Coconut Tree)పై సెల్‌ఫోన్ టవర్‌ను (Network tower) ఏర్పాటు చేశారు. ``ఇది గుర్గావ్. ఇది ఏ చెట్టో నాకు తెలియదు. కానీ చెట్టుపైనే సెల్‌ఫోన్ టవర్‌ను ఇన్‌స్టాల్ చేశారు. గుర్గావ్‌లో ఏదైనా సాధ్యమే`` అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``సైబర్ సిటీ అంటే ఇదేనేమో``, ``ఇలా చేయడం వల్ల ఆ చెట్టు చచ్చిపోతుంది``, ``పక్షులకు కూడా చాలా ప్రమాదకరం``, ``ఈ తెలివికి జోహార్లు``, ``ఇలాంటి తెలివితేటలు మన దేశీయులకే వస్తాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: మీరు సోయా చాప్స్‌ను ఇష్టంగా తింటారా? ఈ వీడియో చూస్తే ఇక వాటి జోలికి వెళ్లరేమో..
Optical Illusion Test: మీ కళ్ల పవర్ ఏ రేంజ్‌లో ఉంది?.. బొమ్మల మధ్యన నిజమైన గుడ్లగూబ ఎక్కడుంది..
Anand Mahindra: ఎన్ని గంటలు పని చేశామన్నది కాదు.. 90 గంటల పని విధానంపై ఆనంద్ మహీంద్రా విసుర్లు..
Teacher`s Whisky: టీచర్స్ విస్కీకి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? దాని వెనుకున్న 175 ఏళ్ల చరిత్ర ఏంటంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి