Viral Video: చూసుకోవాలి కదా బ్రో.. పెళ్లిలో వరుడి పరువు గోవిందా.. ఫన్నీ వీడియో వైరల్..
ABN , Publish Date - Jan 07 , 2025 | 01:09 PM
మన దేశంలో ఇటీవలె పెళ్లిళ్ల సీజన్ ముగిసింది. ఆయా పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో అందరి ముందు వరుడి పరువు పోయింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మన దేశంలో ఇటీవలె పెళ్లిళ్ల సీజన్ (Wedding) ముగిసింది. ఆయా పెళ్లిళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు (Funny Videos) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో అందరి ముందు వరుడి (Groom) పరువు పోయింది. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు (Viral Video).
@HasnaZaruriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మండపంలో వివాహ వేడుక జరుగుతోంది. వధూవరులిద్దరూ పెళ్లి తంతులో భాగంగా ఏడడుగులు వేస్తున్నారు. వరుడు లుంగీ (Lungi) కట్టుకుని నడుస్తున్నాడు. తొలి రౌండ్ పూర్తి కాగానే వరుడి లుంగీ జారి కిందపడిపోయింది. దీంతో చుట్టు పక్కల ఉన్న వారందరూ ఘొల్లుమని నవ్వుకున్నారు. వరుడు సిగ్గుపడి వెంటనే లుంగీ తీసి కట్టుకున్నాడు. ఆ ఘటనను రికార్డు చేసిన వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 40 వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``పాపం.. పరువంతా పోయింది``, ``వధువు పరిస్థితి ఏంటి``, ``ఇది కలలో కూడా ఊహించలేదు``, ``వెరీ ఫన్నీ``, ``లుంగీ కట్టుకుంటే అలాంటి ఇబ్బందులు తప్పవు``, ``పాపం.. పెళ్లిలో ఇలా జరగడం ఘోరం`` అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ ఏనుగు ఎంత మంచిది.. ఎన్‌క్లోజర్‌లో కుర్రాడి చెప్పు పడిపోతే ఏం చేసిందో చూడండి..
Brain Teaser Test: మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మూడు తప్పులను 9 సెకెన్లలో గుర్తించండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి