Share News

Safest Seats In Plane : విమానంలో ఈ సీట్లు చాలా సేఫ్!

ABN , Publish Date - Feb 09 , 2025 | 12:14 PM

ఇటీవల దక్షిణ కొరియా, కజకిస్తాన్‌లలో ఘెర విమాన ప్రమాదాలు సంభవించాయి. వందల మంది ప్రయాణీకులు చనిపోయారు. కానీ, చిత్రంగా రెండు ప్రమాదాల్లో ఈ సీట్లలో కూర్చున్నవారు మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. దీంతో విమానంలో ఈ సీట్లలో కూర్చుంటే ప్లేన్ క్రాష్ అయినా సేఫ్ అనే చర్చలు మొదలయ్యాయి. దీనిపై నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Safest Seats In Plane : విమానంలో ఈ సీట్లు చాలా సేఫ్!
which seat is safe in plane

గతేడాది డిసెంబరులో కజకిస్తాన్‌, దక్షిణ కొరియాలలో ఘెర విమాన ప్రమాదాలు సంభవించాయి. డిసెంబర్ 25న రష్యాకు వెళుతున్న అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం కజకిస్తాన్‌లోని అక్టౌ సమీపంలో కాస్పియన్ సముద్రం మీదుగా క్రాష్-ల్యాండ్ అయింది. ఈ ఘటనలో 38 మంది ప్రయాణికులు విగతజీవులయ్యారు. కొన్ని రోజుల తరువాత దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ సమయంలో జెజు ఎయిర్ బోయింగ్ నారో-బాడీ విమానం కూలిపోయింది. విమానంలో ఉన్న 179 మంది మరణించగా ఇద్దరే ప్రాణాలతో బయటపడ్డారు. ఇది దక్షిణ కొరియా చరిత్రలోనే అత్యంత దారుణమైన విమాన ప్రమాదం. వారం వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదాలు విమానయాన భద్రతపై ప్రజల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఏ సీట్లో కూర్చుంటే సేఫ్ అనే చర్చ మొదలుకావడానికి కారణమిదే..


ఈ సీట్లో కూర్చున్నవారే బతికారు..

వేర్వేరు కారణాలు, పరిస్థితుల్లో విమాన ప్రమాదం జరిగినప్పటికీ రెండు ఘటనల్లో ఒక విషయం కామన్‍‪‌గా కనిపిస్తుంది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్, దక్షిణ కొరియా రెండు ప్రమాదాల్లో వెనుక సీట్లో ఉన్న వారే ప్రాణాలతో బయటపడగలిగారు. దీంతో విమానంలో వెనుక సీట్లు సహజంగానే సురక్షితమైనవా లేదా ఇది కేవలం యాదృచ్చికమా? అనే చర్చలు మొదలయ్యాయి.


విమానంలో ఈ సీట్లకు సేఫ్టీ ట్యాగ్?

కొన్ని అధ్యయనాల ప్రకారం విమానం వెనుక భాగంలో ఉన్న సీట్లు ముందు ఉన్న వాటి కంటే కొంచెం సేఫ్. అలాగని అన్నిసార్లు కచ్చితంగా చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు. అమెరికాకు చెందిన 'ఏవియేషన్ డిజాస్టర్ లా' నివేదిక ప్రకారం, 'పాపులర్ మెకానిక్స్' మ్యాగజైన్ 1971 - 2005 మధ్య జరిగిన విమాన ప్రమాదాలపై ఒక అధ్యయనం నిర్వహించింది. ఇందులో విమానంలో వెనుక భాగంలో ఉన్న సీట్లే అత్యంత సురక్షితమైని తేలింది. అన్ని ప్రమాదాల్లో విమానంలోని ఇతర విభాగాలలో కూర్చున్న వారితో పోలిస్తే వెనుక భాగంలో కూర్చున్నవారికే బతికే అవకాశం 40% ఎక్కువగా ఉన్నట్లు నిరూపించింది.


ఈ సీట్లు ఇందుకే సేఫ్..

ప్రమాదాల సమయంలో ముందు సీట్లలో కూర్చున్నవారికి కేవలం 49% మందికి మాత్రమే బతికే అవకాశం ఉంది. రెక్కల మధ్యలో కూర్చుంటే 59%, అదే వెనుక భాగంలో కూర్చుంటే 69%కి మనుగడకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే విమానం దేన్నైనా ఢీ కొట్టినప్పుడు, క్రాష్ ల్యాండింగ్, రన్‌వే ఓవర్‌రన్‌లు వంటి సందర్భాల్లో ఆయా వస్తువులు మధ్య నలిగిపోయి ప్రాణాలు కోల్పోవచ్చు. వెనక ఉన్నవారిపై ఇంత స్థాయిలో ప్రభావం చూపదు.


ఏది ఏమైనా రోడ్డు మార్గాల మరణాల డేటాతో పోలిస్తే విమాన ప్రయాణం అత్యంత సురక్షితమైన రవాణా మార్గాలలో ఒకటనే విషయం గమనించాలి. WHO, FAA వంటి సంస్థలు వెల్లడించిన ప్రపంచ భద్రతా గణాంకాలు ఇవే చెబుతున్నాయి. చాలా తక్కువ సందర్భాల్లోనే సాంకేతిక, వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదాల వల్లే విమాన ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి..

రోబో ప్రేయసి..

Elon Musk: టిక్‌టాక్‌ను ఎలన్ మస్క్ కొనేస్తున్నారా? ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే..

Updated Date - Feb 09 , 2025 | 01:33 PM