Share News

Viral: యువతలో కొత్త ట్రెండ్.. జాబ్‌లో చేరిన తొలి రోజే కంపెనీలకు షాకిస్తూ రాజీనామాలు!

ABN , Publish Date - Jan 11 , 2025 | 06:09 PM

నియామక ప్రక్రియలు సంక్లిష్టంగా మారిన తరుణంలో జెన్ జీ తరం ఉద్యోగులు తమ కెరీర్, జీవితంపై అదుపు కోసం కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. జాబ్ నచ్చకపోతే తొలి రోజునే ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు.

Viral: యువతలో కొత్త ట్రెండ్.. జాబ్‌లో చేరిన తొలి రోజే కంపెనీలకు షాకిస్తూ రాజీనామాలు!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం జాబ్ మార్కెట్ పరిస్థితి ఏమీ బాలేదని చెప్పకతప్పదు. దీంతో, యువతరం.. ముఖ్యంగా 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిలో అనేక మంది ఆధునిక ఉద్యోగ ఎంపిక ప్రక్రియలతో విసిగిపోయారట. దీంతో, జాబ్ ఆఫర్ తీసుకున్నా కూడా ఏమాత్రం తేడాగా అనిపించినా ఆఫీసుకు రాకుండా సైలెంట్‌గా మానేస్తున్నారట. దీంతో, ఏం జరిగిందో అర్థంకాక మేనేజర్లు తలబాదుకుంటున్నారట (Viral).

ఈ మధ్య బ్రిటన్‌లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, జెన్ జీ (ఆంగ్ల అక్షరం జెడ్) తరం ఉద్యోగుల్లో (1997-2012 మధ్య పుట్టిన వారు) 34 శాతం మంది ఇదే విధానం ఫాలోఅయ్యారట. అంతేకాకుండా, ఆఫీసులో అలా కనిపించి మళ్లీ వెళ్లిపోవడం, లేదా చెప్పాపెట్టకుండా సెలవులపై వెళ్లిపోవడం చేస్తున్నారట.

ఉద్యోగ నియామక ప్రక్రియల్లో జాప్యం, సుదీర్ఘకాలం పాటు సాగే ఇంటర్వ్యూలు, సంస్థల నుంచి ఆశించిన స్పందన లేకపోవడం వంటి కారణాలతో విసిగిపోతున్న యువత తమ జీవితం, కెరీర్‌పై మరింత నియంత్రణ కోసం, జీవితాన్ని తమకు నచ్చినట్టు ఆస్వాదించడం కోసం ఇలాంటి ట్రెండ్ వైపు మళ్లుతున్నట్టు తేలింది. అయితే, జెన్ ఎక్స్ తరంలో 15 శాతం మంది, బేబీ బూమర్స్‌లో 10 శాతం మంది ఇలాంటి చర్యలకు దిగినట్టు తేలింది.


Viral: తన తండ్రికి ఉద్యోగం కోరుతూ యువతి అభ్యర్థన .. నెట్టింట ప్రశంసల వెల్లువ

ఇక జెన్ జీ (ఆంగ్ల అక్షరం జెడ్) తరంలో 38 శాతం మంది అధికారికంగా రాజీనామా చేయకుండానే జాబ్స్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారని కూడా ఈ సర్వేలో బయటపడింది. కానీ మిలీనియల్స్, బేబీ బూమర్స్ లో మాత్రం ఈ తీరు కాస్త తక్కువగానే ఉన్నట్టు తెలిసింది.

జెన్ జీలో అత్యధిక శాతం మంది తమ జీవితాన్ని నచ్చినట్టు గడిపేందుకు సంప్రదాయ పద్ధతులను పక్కనబెట్టి పలు కొత్త వ్యూహాల వైపు మళ్లుతున్నారట. ఒకేసారి పలు రిమోట్ జాబ్స్ చేస్తున్నట్టు 41 శాతం మంది చెప్పుకొచ్చారు. ఇక ఆఫీసుకొచ్చి అలా ముఖం చూపించి మళ్లీ ఇంటికెళ్లి పని చేసే కాఫీ బ్యాడ్జింగ్ విధానాన్ని అనుసరిస్తున్నామని 44 శాతం మంది చెప్పారు. అంతేకాకుండా, పై అధికారులకు చెప్పకుండా బ్రేకులు, సెలవులు తీసుకునే వారు కూడా ఈ తరంలోనే ఎక్కువగా ఉన్నట్టు తేలింది.

Viral: ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలన్న ఎల్‌అండ్‌టీ చైర్మన్‌పై కొనసాగుతున్న విమర్శలు!


జెన్ జీ తరం ఉద్యోగులకు స్థిరమైన, ఫుల్ టైం జాబ్ దొరకడం కష్టంగా మారిందని సర్వే తేల్చింది. 2025 తరువాత ఉద్యోగజీవితంలోకి కాలుపెట్టే యువతరం మునుపటి కంటే ఎక్కువగా ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని తేలింది. ఆశించిన శాలరీలు దక్కడం కూడా కష్టంగానే మారింది. ఈ నేపథ్యంలో అనేక మంది జెన్ జీ యువత తమ కొత్త ఉద్యోగం అంచనాల మేరకు లేదని భావిస్తే తొలి రోజునే నిర్మొహమాటంగా గుడ్ బై చెప్పేస్తున్నారని ఈ సర్వే తేల్చింది.

Read Latest and Viral News

Updated Date - Jan 11 , 2025 | 06:13 PM