Viral: రోడ్డుపై వాగ్వాదం.. మహిళలను పైకెత్తి నేలకేసి విసిరికొట్టిన వ్యక్తి
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:39 PM
తనపై చేయి చేసుకున్న మహిళను ఓ వ్యక్తి గాల్లోకెత్తి నేలపై విసిరికొట్టాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకైపోయేలా చేస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: రహదారులపై వాహనదారులు వాగ్వాదాలకు దిగడం సాధారణమే. చిన్న చిన్న విషయాల్లోనే మొదలయ్యే గొడవలు ఒక్కోసారి పరస్పరం చేయి చేసుకునే వరకూ వెళుతుంటాయి. కానీ, ఈ వివాదాల్లో కూడా ఒక్కోసారి అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటాయి. అచ్చం సినీ ఫక్కీలో జరిగే ఈ ఘటనలను ప్రత్యక్షంగా చూస్తే కానీ నమ్మలేం. అలాంటి ఓ ఉదంతం తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకై పోయేలా చేస్తోంది. వీడియో చూసిన జనాలు నోరెళ్లబెడుతున్నారు (Viral)..
Viral: వామ్మో.. లక్ అంటే ఇదీ.. కేరళ నర్సుకు రూ.70 కోట్ల లాటరీ!
అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ప్రకారం, ఓ మహిళ తన నీలి రంగు కారును అకస్మాత్తుగా రోడ్డుపై ఆపేసింది. కారు దిగిని ఆమె వెనక వస్తున్న మరో కారును ఆపి డ్రైవర్‌ను బయటకు రమ్మని పిలిచింది. డ్రైవర్ పక్కనే కూర్చొన్న ఓ వ్యక్తి బయటకు వచ్చి రగడ చేస్తున్న మహిళను శాంత పరిచే ప్రయత్నం చేశారు. ఆమె మాత్రం వినిపించుకోకుండా రెచ్చిపోయి అతడితో వాగ్యుద్ధానికి దిగింది. ఆమెతో వాదనతో ఉపయోగం లేదని గ్రహించిన వ్యక్తి వెనక్కు తిరిగి వెళ్లిపోతుండగా మహిళ వెనక నుంచి అతడి చెంప చెళ్లుమనిపించింది. దీంతో, అతడికి కోపం నషాళానికి అంటింది. వెంటనే మహిళ చెంప పగలగొట్టిన అతడు ఆ తరువాత ఆమెను పైకెత్తి నేలపై విసిరేశాడు. దెబ్బకు షాక్ తిన్న మహిళ కదలలేక అలాగే ఉండిపోయింది. ఈ లోపు సదరు వ్యక్తి కారు ఎక్కి వెళ్లిపోయాడు. అయితే, ఈ ఘటనలో మహిళ ఎలాంటి గాయాలు కాలేదు.
Viral: రూ.30 లేక ఆసుపత్రి బయటే నిద్ర.. చలికి తట్టుకోలేక మృతి
ఈ సీన్ నెట్టింట వైరల్ కావడంతో అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరస్పరం చేయి చేసుకోవడం సబబు కాదని అన్నారు. మరికొందరు మహిళను తట్టిపోశారు. అకారణంగా అవతలి వారిపై చేయి చేసుకుంటే ఇలాంటి పరిస్థితి తప్పదని హెచ్చరించారు.
కాగా, ఈ వీడియో వైరల్ కావడంతో తొలుత గొడవకు దిగిన మహిళ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నేలపై పడ్డ మహిళలను తానే అని చెప్పుకొచ్చింది. అయితే, ఈ ఘటన తరువాత తాను గుణపాఠం నేర్చుకున్నానని చెప్పిన ఆమె ఇది అందరికీ గుణపాఠమని వర్ణించింది.
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక అమ్మేసిన కుటుంబ సభ్యులు.. తట్టుకోలేక టీనేజర్ ఆత్మహత్య