Share News

Viral: సరదా కోసం కన్వేయర్ బెల్ట్‌పైకెక్కిన వృద్ధురాలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jan 10 , 2025 | 10:20 PM

రష్యాలోని ఓ ఎయిర్‌పోర్టుకు వచ్చిన వృద్ధురాలు కన్వేయర్ బెల్ట్‌పై నిలబడిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral: సరదా కోసం కన్వేయర్ బెల్ట్‌పైకెక్కిన వృద్ధురాలు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల రష్యాలో ఓ వృద్ధురాలు ఎయిర్‌పోర్టులో చేసిన పని ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె పొరపాటు పడి ఉంటుందని కొందరు అంటే.. కాదు కావాలనే అలా చేసుండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. వ్లాదికావ్కాజ్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది (Viral).

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, సదరు మహిళ లగేజీతో సహా ఎయిర్‌పోర్టుకు వచ్చింది. చెకిన్ కౌంటర్ వద్ద వేచి చూసే సమయంలో ఆమె దృష్టి పక్కనే ఉన్న కన్వేయర్ బెల్ట్‌పై పడింది. కదిలే ఈ బెల్ట్‌పై ప్రయాణికులు సామాన్లు పెడితే వాటంతట అవే లాగేజీ హ్యాండ్లింగ్ ఏరియాకు వెళ్లిపోతాయి. అక్కడి సిబ్బంది వాటిని తీసి జాగ్రత్తగా విమానంలోకి తరలిస్తారు.

Viral: వీసమెత్తు పనిచేయకుండా లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి! ఇతడి బిజినెస్ ఎంటో తెలిస్తే..


కాగా, వీడియోలోని మహిళ కన్వేయర్ బెల్ట్ ముందుకొచ్చి కాసేపు నిలబడింది. ఎదురుగా ఉన్న స్క్రీన్‌ను కూడా కాసేపు పరిశీలించింది. ఆ తరువాత మెల్లా కన్వేయర్ బెల్ట్‌పైకి ఎక్కింది. అది ఒక్కసారిగా కదలడంతో మహిళ వెనక్కు పడింది. ఆ తరువాత బెల్ట్ ఆమెను లోపలకు తీసుకెళ్లిపోయింది. పక్కనే ఉన్న కౌంటర్లలోని సిబ్బంది ప్రయాణికులతో మాట్లాడుతూ బిజీగా ఉండటంతో వృద్ధురాలు చేస్తున్నదేంటో వారు గమనించలేదు. ఇతరులు గమనించి వారిని అలర్ట్ చేసేటప్పటికీ వృద్ధురాలు లోపలకు వెళ్లిపోయింది. దీంతో, సిబ్బంది షాకైపోయారు.

Viral: ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలన్న ఎల్‌అండ్‌టీ చైర్మన్‌పై కొనసాగుతున్న విమర్శలు!


కన్వేయర్ బెల్ట్‌పై ప్రయాణికులు నిలబడి బోర్డింగ్ ప్రాంతంలోకి వెళతారని వృద్ధురాలు పొరపాటు పడి ఉండొచ్చని కొందరు సందేహం వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ఆమె కావాలనే ఇలా చేసి ఉండొచ్చని అన్నారు. ఆ బెల్ట్‌పై నిలబడి లోపలికెళితే ఏమవుతుందో తెలుసుకోవాలని చిన్న పిల్లల్లా కుతూహలపడి ఆమె బెల్ట్‌పైకి ఎక్కి ఉండొచ్చని అన్నారు. వృద్ధురాలికి ఆ తరువాత ఏం జరిగిందో తెలియకపోయినప్పటికీ ఈ వీడియో ఫన్నీగా ఉండటంతో నెట్టింట తెగ ట్రెండవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అయితే, కన్వేయర్ బెల్ట్‌పై వెళ్లేందుకు ప్రయత్నిస్తే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. బెల్ట్‌లోని వివిధ భాగాల్లో కాళ్లు, చేతులూ ఇరుక్కుని గాయాలు పాలయ్యే , ఎముకలు విరిగే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.

Read Latest and Viral News

Updated Date - Jan 10 , 2025 | 10:20 PM