Viral: మెట్రోలో సీటు కోసం జుట్లు పట్టుకుని తన్నుకున్న మహిళలు! ఢిల్లీ మెట్రోలో షాకింగ్ సన్నివేశం
ABN , Publish Date - Jan 09 , 2025 | 10:41 PM
ఢిల్లీ మెట్రో రైల్లో సీటు కోసం ఇద్దరు ప్రయాణికురాళ్లు జుట్లు పట్టుకుని గొడవపడ్డ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీళ్లింక మారరా అని జనాలు నెత్తిబాదుకునేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: మెట్రో రాకతో నగర ప్రయాణాలు సౌకర్యవంతంగా మారాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, మెట్రోలో సీటులో కూర్చుని ప్రయాణించాలనే మొండి పట్టుదలతో కొందరు ఇతర ప్రయాణికులతో తెగ గొడవ పడుతుంటారు. ఇలాంటి ఘటనలతో ఢిల్లీ మెట్రో నిత్యం వార్తల్లోకెక్కుతుంటుంది. తాజాగా మరో ఘటన చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. సమాజం ఎంత పురోగమించినా జనాల్లో సంస్కారం మాత్రం రావట్లేదంటూ పెదవి విరుస్తున్నారు (Viral).
Viral: వామ్మో.. ఇలా అయితే భారత్ వెనకబడినట్టే.. ఆనంద్ మహీంద్రా పోస్టు వైరల్
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, సీటు కోసం ఇద్దరు మహిళలు తెగ గొడవ పడ్డారు. జుట్లు పట్టుకుని కొట్టుకునే వరకూ వెళ్లారు. సీటులో ఉన్న ఓ మహిళ నిలబడ్డ మరో యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వచ్చి నా ఒళ్లో కూర్చో అంటూ చిరాకు ప్రదర్శించింది. దీంతో, నిలబడి ఉన్న మహిళ ఊహించని విధంగా చుట్టుకున్న ఆమె ఒళ్లో కూర్చొనే ప్రయత్నం చేసింది. దీంతో, సీటులోని ప్రయాణికురాలికి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. ఎదుట ఉన్న యువతి జుట్టు పట్టుకుని కొట్టే ప్రయత్నం చేసింది. అయితే, అంతకుముందు నిలబడి ఉన్న యువతి కూర్చొన్న ఇద్దరి మధ్యలో ఇరుక్కుని కూర్చొనే ప్రయత్నం చేసిందని, ఇది చినికిచినికి గాలివానగా మారింది చివరకు తన్నుకునే వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది.
Viral: ఇన్ఫీ నారాయణ మూర్తిని మించిపోయిన ఎల్ అండ్ టీ చైర్మన్! వారానికి 90 గంటలు పనిచేయాలంటూ పిలుపు
ఇక వీడియోపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. మెట్రోల్లో సీట్ల కోసం ఇలా దారుణంగా తగాదా పడటం ఏమాత్రం సంస్కారం అనిపించుకోదని పెదవి విరిచారు. పాశ్చాత్య దుస్తులు ధరిస్తే సరిపోదని, కాస్తంత సివిక్ సెన్స్ కూడా అలవర్చుకోవాలని అన్నారు. అవతలి వారి మీద కూర్చోవద్దన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా అని కొందరు ప్రశ్నించారు. ఇది అవగాహన లేమితో చేస్తున్న చర్యలు కావని, తమను ఎవరూ ఏమీ అనరనే ధైర్యంతో ఇలా కట్టతప్పి ప్రవర్తిస్తుంటారని మరికొందరు అన్నారు. మెట్రోల్లో ముఖ్యంగా ఢిల్లీ మెట్రోల్లో ఇలాంటి తగాదాలు సాధారణమైపోయాయని, సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తున్నామన్న సంతోషం మిగలకుండా చేస్తుంటారని కొందరు విమర్శించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Viral: వేలంలో రూ.56 లక్షలకు అమ్ముడుపోయిన రూ.100 హజ్ నోటు’