Share News

Viral: ప్రపంచంలో అతి భారీ ట్రాఫిక్ జామ్! 100 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!

ABN , Publish Date - Jan 03 , 2025 | 10:31 AM

2010లో చైనాలోని బీజింగ్ టిబెట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఏర్పడిన ట్రాఫిక్ జాం ప్రపంచంలోనే అతిభారీ ట్రాఫిక్ జామ్‌గా ప్రసిద్ధికెక్కింది. 100 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాల మళ్లి కదిలేలా చేసేందుకు అధికారులకు ఏకంగా 12 రోజులు పట్టింది.

Viral: ప్రపంచంలో అతి భారీ ట్రాఫిక్ జామ్! 100 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!

ఇంటర్నెట్ డెస్క్: ట్రాఫిక్ జాంతో ఎంతటి ఇబ్బంది కలుగుతుందో మాటల్లో చెప్పడం కష్టం. భారతీయ మెట్రో నగరాల్లో ప్రయాణం ట్రాఫిక్ జామ్‌ల కారణంగా నరకప్రాయంగా మారుతోంది. కాలుష్యంలో ఎక్కువ సేపు గడిపిన కారణంగా అనేక మంది వాహనదారుల ఆరోగ్యాలు గుల్లవుతున్నాయి. సమయం కూడా వృథా అయిపోతోంది. అయితే, 2010లో చైనాలో ఏర్పడిన ఓ ట్రాఫిక్‌ జామ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా రికార్డు సృష్టించింది. మరి ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Viral).

2010లో బీజింగ్, టిబెట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ అసాధారణ ట్రాఫిక్ జమ్‌ ఏర్పడింది. రహదారిపై ఏకంగా 100 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు ఏకంగా 12 రోజులు పట్టిందంటే ఇది ఎంత పొడవైన ట్రాఫిక్ జామ్ అనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంగుళం మేర కూడా కదలలేక వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి (Beijing-Tibet Expressway Traffic Jam).

Viral: కాటరాక్ట్ ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ కంట్లో ఏకంగా 27 కాంటాక్ట్ లెన్సులు! వైద్యులకే భారీ షాక్


స్థానిక మీడియా కథనాల ప్రకారం, 2010 ఆగస్టు 14న అక్కడి ఎక్స్‌ప్రెస్‌పై రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో, భారీ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా మంగోలియా నుంచి నిర్మాణ సామగ్రి, బొగ్గు తరలిస్తున్న ట్రక్కులతో సస్ ఏర్పడింది. ఈ క్రమంలో కొన్ని చెడిపోవడంతో సమస్య ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. అప్పటికే నిర్మాణ పనుల కోసం రోడ్డును పాక్షికంగా మూసేశారు. దీనికి తోడు రోడ్డుపై భారీ ట్రక్కులు అడ్డంగా నిలిచిపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది.

Viral: ఇది అత్యంత చిన్న దేశం.. ఇక్కడి సైనికులకు మాత్రం ఏకంగా రూ. కోటి జీతం!


గంటలు గడిచేకొద్దీ రోడ్డుకు రెండు వైపులా వాహనాలు భారీగా బారులు తీరి నిలిచాయి. ఇలా మొదలైన ట్రాఫిక్ జాం రోజుల తరబడి కొనసాగింది. వేల మంది ప్రయాణికులు ఎటూ కదలలేక ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. చివరకు అనేక మంది తమ వాహనాల్లోనే నిద్రపోయార. తిండీతిప్పలు లేక అలమటించారు. చివరకు ఇది బతుకు పోరాటంగా మారింది.

మరోవైపు, పరిస్థితి అదుపు చేందుకు అధికారులు వేగంగా దిద్దుబాటు చర్యలకు దిగారు. అడ్డంగా నిలిచిపోయిన ట్రక్కులను పక్కకు తొలగించి మార్గం సుగమం చేద్దామనుకున్నారు కానీ అది అనుకున్నంత సులభం కాదని వారికి త్వరగానే అర్థమైంది. దీంతో, అతి జాగ్రత్తగా ప్లాన్ చేసి సమస్యను పరిష్కరించేందుకు ఏకంగా 12 రోజులు పట్టింది. ఆగస్టు 26 మళ్లీ ట్రాఫిక్ యథాప్రకారం ముందుకు కదిలింది. దీంతో, ఇది చరిత్రలో అధిభారీ ట్రాఫిక్‌ జామ్‌గా నిలిచిపోయింది.

Read Latest and Viral News

Updated Date - Jan 03 , 2025 | 10:34 AM