Share News

BCCI: టీమిండియా స్టార్లపై కోట్ల వర్షం.. ఎవరెవరికి ఎంతంటే..

ABN , Publish Date - Mar 20 , 2025 | 01:48 PM

Champions Trophy 2025: భారత జట్టు ఆటగాళ్లపై కనకవర్షం కురిసింది. సరిగ్గా ఐపీఎల్ కొత్త సీజన్ ఆరంభానికి ముందు టీమిండియా స్టార్లు అదిరిపోయే గిఫ్ట్ అందుకున్నారు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

BCCI: టీమిండియా స్టార్లపై కోట్ల వర్షం.. ఎవరెవరికి ఎంతంటే..
Team India

టీమిండియా మీద కనకవర్షం కురిసింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మిగిలిన ఆటగాళ్లు.. హెడ్ కోచ్ గౌతం గంభీర్‌ సహా ఇతర కోచింగ్-సపోర్ట్ స్టాఫ్ మీద కోట్ల వాన కురిసింది. సరిగ్గా ఐపీఎల్-2025 సీజన్ ఆరంభానికి ముందు భారత జట్టు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూపర్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను టీమిండియా గెలుచుకున్న నేపథ్యంలో భారీ ప్రైజ్‌మనీ ప్రకటించింది బీసీసీఐ. ఊహించని రీతిలో బిగ్ క్యాష్ రివార్డ్‌ను అనౌన్స్ చేసింది. మరి.. బోర్డు ఇచ్చే క్యాష్ రివార్డులో నుంచి ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్‌కు దక్కేది ఎంత.. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి జేబులోకి వచ్చేది ఎంత.. అనేది ఇప్పుడు చూద్దాం..


ఎవరెవరికి ఎంతంటే..

చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నందుకు టీమిండియా మీద కోట్ల వర్షం కురిపించింది భారత క్రికెట్ బోర్డు. ఏకంగా రూ.58 కోట్ల మొత్తాన్ని క్యాష్ ప్రైజ్‌గా అనౌన్స్ చేసింది. ఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచింగ్-సపోర్ట్ స్టాఫ్‌తో పాటు సెలెక్షన్ కమిటీ మెంబర్స్‌కు కూడా అందజేయనున్నారు. భారత జట్టులోని ప్రతి ఆటగాడికి రూ.3 కోట్లు అందనున్నాయి. హెడ్ కోచ్ గంభీర్‌కు కూడా అంతే మొత్తం దక్కనుంది. మిగిలిన కోచింగ్-సపోర్ట్ స్టాఫ్‌కు రూ.50 లక్షలు చొప్పున అందజేస్తారు.


అందుకే ఇస్తున్నాం

సీటీ-2025లో భారత జట్టు ప్రదర్శనకు ప్రోత్సాహకంగా క్యాష్ రివార్డును ఇస్తున్నట్లు వెల్లడించారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. అంత ఒత్తిడిలోనూ ప్లేయర్లు ఆడిన తీరు, ప్రెజర్‌ను ఎదుర్కొన్న విధానం, విజయతీరాలకు చేరిన పద్ధతి యంగ్‌స్టర్స్‌కు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు శుక్లా. నైపుణ్యం, మానసిక దృఢత్వం, గెలవాలనే మనస్తత్వం లాంటి పునాదుల మీద భారత క్రికెట్ నిర్మించారనే విషయాన్ని చాంపియన్స్ ట్రోఫీ విక్టరీ మరోసారి ప్రూవ్ చేసిందన్నారు రాజీవ్ శుక్లా.


ఇవీ చదవండి:

హెచ్‌సీఏలో రూ.90 లక్షల అవినీతి

టీమిండియా స్టార్లపై కోట్ల వర్షం

సంజూ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండీ

Updated Date - Mar 20 , 2025 | 03:32 PM