Share News

Hilton Cartwright: 121 మీటర్ల సిక్స్.. బ్యాటరా.. రాక్షసుడా.. నీళ్లు తాగినంత ఈజీగా బాదేశాడు

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:28 AM

Big Bash League: 100 మీటర్ల సిక్స్ కొట్టేందుకు చాలా మంది బ్యాటర్లు ఆపసోపాలు పడతారు. పర్ఫెక్ట్ టైమింగ్, రెట్టింపు బలంతో బాల్‌ను సరైన రీతిలో కొడితే గానీ అంతదూరం పోదు. అయితే ఓ బ్యాటర్ మాత్రం అమాంతం 121 మీటర్ల సిక్స్ కొట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

Hilton Cartwright: 121 మీటర్ల సిక్స్.. బ్యాటరా.. రాక్షసుడా.. నీళ్లు తాగినంత ఈజీగా బాదేశాడు
Hilton Cartwright

100 మీటర్ల సిక్స్ కొట్టేందుకు చాలా మంది బ్యాటర్లు ఆపసోపాలు పడతారు. పర్ఫెక్ట్ టైమింగ్, రెట్టింపు బలంతో బాల్‌ను సరైన రీతిలో కొడితే గానీ అంతదూరం పోదు. అయితే ఓ బ్యాటర్ మాత్రం అమాంతం 121 మీటర్ల సిక్స్ కొట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. నీళ్లు తాగినంత ఈజీగా బిగ్ సిక్స్ బాది ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత కూడా భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇది బిగ్‌బాష్ లీగ్‌లో చోటుచేసుకుంది. మరి.. క్రికెట్‌లో అత్యంత భారీ సిక్స్ కొట్టిన ఆ బ్యాటర్ ఎవరు? ఏ మ్యాచ్‌లో అతడు ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు? అనేది ఇప్పుడు చూద్దాం..


అవాక్కయిన అభిమానులు!

ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ హిల్టన్ కార్ట్‌రైట్ నమ్మశక్యం కాని ఫీట్‌ను అందుకున్నాడు. బీబీఎల్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ టీమ్‌కు ఆడుతున్న కార్ట్‌రైట్.. రెనెగేడ్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 121 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. రోజర్స్ అనే బౌలర్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ మూడో బంతికి అతడు ఈ అద్భుతం చేశాడు. ఆఫ్ సైడ్ వికెట్లకు దూరంగా పడిన బంతిని చక్కటి టైమింగ్‌తో లాంగాన్ దిశగా బలంగా కొట్టాడు. బాల్ వచ్చిన వేగానికి, అతడి టైమింగ్‌, బ్యాట్ స్పీడ్, బలం తోడవడంతో ఏకంగా 121 మీటర్ల దూరంలో వెళ్లి గ్యాలరీలోని ఆడియెన్స్ దగ్గర పడింది. దీంతో అంతా అవాక్కయ్యారు.


అరుదైన క్లబ్‌లో..

ఇంత భారీ సిక్స్ కొట్టావ్.. నువ్వు మామూలోడివి కాదు బాస్ అంటూ హిల్టన్ కార్ట్‌రైట్‌ను అంతా మెచ్చుకుంటున్నారు. 121 మీటర్ల దూరం వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. క్రికెట్ హిస్టరీలో అత్యంత భారీ సిక్సుల్లో ఇదొకటిగా చెప్పొచ్చు. లాంగెస్ట్ సిక్సెస్ లిస్ట్‌లో కార్ట్‌రైట్ చోటు దక్కించుకున్నాడు. షాహిద్ అఫ్రిదీ (153 మీటర్ల సిక్స్), బ్రెట్ లీ (130 మీటర్లు), మార్టిన్ గప్తిల్ (127 మీటర్లు), లియామ్ లివింగ్‌స్టన్ (122 మీటర్లు), కోరె అండర్సన్ (122 మీటర్లు) ఈ లిస్ట్‌లో ముందంజలో ఉన్నారు. కార్ట్‌రైట్ సిక్స్ చూసిన నెటిజన్స్.. భలే షాట్ బాస్, నువ్వు గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు.


ఇవీ చదవండి:

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. రోహిత్-కోహ్లీని ఆడిస్తారా.. ఆపేస్తారా..

రోహిత్‌కు అంబానీ వార్నింగ్.. ఓవరాక్షన్ చేస్తే ఊరుకోనంటూ..

‘సెలెక్టర్లే నిర్ణయం తీసుకొంటారు’

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 07 , 2025 | 11:48 AM