Share News

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌లో సడన్ చేంజ్.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Mar 29 , 2025 | 03:38 PM

Indian Premier League: ఐపీఎల్‌ షెడ్యూల్‌లో ఆకస్మిక మార్పులు చేసింది భారత క్రికెట్ బోర్డు. మరి.. బీసీసీఐ ఇలా సడన్ చేంజెస్ ఎందుకు చేయాల్సి వచ్చింది.. పోస్ట్‌పోన్‌కు అసలు రీజన్ ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌లో సడన్ చేంజ్.. కారణం ఏంటంటే..
IPL 2025 Schedule

క్రికెట్ లవర్స్‌కు మస్తు వినోదాన్ని పంచుతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఒకదాన్ని మించి మరో హైటెన్షన్ మ్యాచులు, లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్, భారీ స్కోర్లు.. వెరసి అభిమాలనులు ఫుల్ ఎంటర్‌టైన్ అవుతున్నారు. చూస్తుండగానే రెండో వారంలోకి అడుగుపెట్టింది క్యాష్ రిచ్ లీగ్. ఈ తరుణంలో ఓ షాకింగ్ న్యూస్. ఐపీఎల్ షెడ్యూల్‌లో సడన్ చేంజెస్ చేసింది భారత క్రికెట్ బోర్డు. అయితే పెద్ద మార్పేమీ కాదు. కేవలం ఒక మ్యాచ్ విషయంలో మాత్రమే మార్పు చోటుచేసుకుందని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. ఆ మ్యాచ్ ఏంటి.. ఏయే టీమ్స్ మధ్య జరగాల్సింది.. ఏ తేదీకి పోస్ట్‌పోన్ చేశారు.. అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..


పోస్ట్‌పోన్

ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జియాంట్స్ టీమ్స్ మధ్య ఏప్రిల్ 6వ తేదీన మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అదే రోజు శ్రీ రామ నవమి కావడంతో కోల్‌కతాలో భారీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో సెక్యూరిటీ ఇష్యూస్ తప్పవని, ఫుల్ ప్రొటెక్షన్ కల్పించలేమని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు కోల్‌కతా పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్‌లో చేంజెస్ చేసింది బీసీసీఐ. ఏప్రిల్ 8వ తేదీన అదే ఈడెన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్ 6న డబుల్ హెడర్ స్థానంలో కేవలం సన్‌రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో పైఒక్క మ్యాచ్‌లో తప్పితే ఇతర మార్పులేవీ లేవు. మిగతా మ్యాచులన్నీ యథావిధిగానే షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. సో, ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.


ఇవీ చదవండి:

కోహ్లీతో పెట్టుకున్నాడు.. ఇక కెరీర్ ఖతం

మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది

ఓటమికి సాకులు వెతుకుతున్న చెన్నై

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2025 | 03:39 PM