Share News

IPL 2025 KKR vs PBKS: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు

ABN , First Publish Date - Apr 26 , 2025 | 07:03 PM

IPL 2025: ప్లేఆఫ్స్ చేరాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిన సిచ్యువేషన్‌లో ఉంది కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ తరుణంలో పటిష్టమైన పంజాబ్ కింగ్స్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో తలపడుతోంది రహానె సేన. విజయం కోసం రెండు జట్లు ఆఖరి క్షణం వరకు నువ్వానేనా అంటూ పోటీపడటం ఖాయంగా కనిపిస్తోంది.

IPL 2025 KKR vs PBKS: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
KKR vs PBKS live

Live News & Update

  • 2025-04-26T23:07:31+05:30

    వర్షం కారణంగా మ్యాచ్ రద్ధు

    • పంజాబ్ vs కేకేఆర్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి

    • మ్యాచ్ రద్ధు చేసిన అంపైర్లు

    • ఇరు జట్లకు చెరో పాయింట్

  • 2025-04-26T21:16:25+05:30

    కేకేఆర్ టార్గెట్ @ 202

    • పంజాబ్ 20 ఓవర్లలో 201/4

    • రాణించిన ప్రభ్‌సిమ్రన్ (83)

    • ప్రియాంశ్ ఆర్య (69)

  • 2025-04-26T20:46:00+05:30

    దంచికొడుతున్నారు

    • పంజాబ్ బ్యాటర్లు దంచి కొడుతున్నారు.

    • ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 83 నాటౌట్) సిక్సర్లతో కేకేఆర్‌పై విరుచుకుపడుతున్నాడు.

    • ప్రభుసిమ్రన్ ధాటికి 14.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులతో భారీ స్కోరు దిశగా వడివడిగా పరుగులు తీస్తోంది పంజాబ్.

  • 2025-04-26T20:32:29+05:30

    • పంజాబ్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది.

    • ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69) ఔట్ అయ్యాడు.

    • రస్సెల్ బౌలింగ్‌లో వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 2025-04-26T20:21:49+05:30

    • పంజాబ్ యంగ్ ఓపెనర్ ప్రియాన్ష్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు.

    • 27 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడీ లెఫ్టాండ్ బ్యాటర్.

    • పంజాబ్ ప్రస్తుతం 10.1 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 96 పరుగులతో ఉంది.

  • 2025-04-26T20:07:23+05:30

    ప్రియాన్ష్ అదరహో..

    • ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రియాన్ష్ ఆర్య నిలిచాడు.

    • ఇప్పటిదాకా 8 మ్యాచుల్లో కలిపి 254 పరుగులు చేశాడీ లెఫ్టార్మ్ బ్యాటర్.

  • 2025-04-26T20:04:03+05:30

    గుడ్ స్టార్ట్

    • కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు అదరగొడుతున్నారు.

    • తొలి వికెట్‌కు 6.4 ఓవర్లలో 58 పరుగులు జోడించారు.

    • ప్రియాన్ష్ ఆర్య (19 బంతుల్లో 31 నాటౌట్), ప్రభుసిమ్రన్ సింగ్ (22 బంతుల్లో 26 నాటౌట్) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు.

    • శుభారంభం దొరకడంతో ఇక భారీ షాట్లతో స్కోరు బోర్డును పరిగెత్తించాలని చూస్తున్నారు.

  • 2025-04-26T19:42:55+05:30

    • కేకేఆర్‌తో మ్యాచ్‌ను పాజిటివ్‌గా స్టార్ట్ చేసింది పంజాబ్.

    • ఓపెనర్లు ప్రియాన్ష్ (10 నాటౌట్), ప్రభుసిమ్రన్ సింగ్ (3 నాటౌట్) అడ్డగోలు షాట్లు ఆడకుండా నింపాదిగా బ్యాటింగ్ చేస్తున్నారు.

    • 2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 13 పరుగులు చేసింది పంజాబ్.

  • 2025-04-26T19:09:43+05:30

    ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే..

    • గత మ్యాచ్‌లో ఆడని గ్లెన్ మాక్స్‌వెల్, అజ్మతుల్లా ఒమర్జాయికి కేకేఆర్‌తో ఫైట్‌లో తుదిజట్టులో చాన్స్ ఇచ్చింది పంజాబ్ మేనేజ్‌మెంట్.

    • కోల్‌కతా ప్లేయింగ్ ఎలెవన్‌లోనూ పలు మార్పులు చేశారు.

    • మొయిన్ అలీ ప్లేస్‌లో రోమన్ పావెల్‌ను తుదిజట్టులోకి తీసుకుంది కేకేఆర్.

    • పేసర్ చేతన్ సకారియాకూ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించింది.

  • 2025-04-26T19:03:02+05:30

    • ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గింది పంజాబ్ కింగ్స్.

    • తొలుత బ్యాటింగ్ చేయాలని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డిసైడ్ అయ్యాడు.

    • ఆతిథ్య జట్టు కేకేఆర్ మొదట బౌలింగ్‌కు దిగనుంది.

  • 2025-04-26T19:03:01+05:30

    • ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ మొదలైంది.

    • అయ్యర్ సేనతో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమైపోయింది కేకేఆర్.

    • ఇరు జట్లకు గెలుపు ముఖ్యం కాబట్టి ఈ ఫైట్ ఆఖరి ఓవర్ వరకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.