Share News

IPL 2025 New Umpire Rules: అంపైర్లకు దండం పెడుతున్న ఫ్రాంచైజీలు.. ముంచుతారో తేల్చుతారో

ABN , Publish Date - Mar 21 , 2025 | 09:18 AM

IPL 2025 Umpires Role: ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ ఇప్పుడు అంపైర్ల మీదే ఆధారపడుతున్నాయి. వాళ్ల నిర్ణయాల మీదే గెలుపోటములు కూడా డిసైడ్ కానున్నాయి.

IPL 2025 New Umpire Rules: అంపైర్లకు దండం పెడుతున్న ఫ్రాంచైజీలు.. ముంచుతారో తేల్చుతారో
IPL 2025

ఐపీఎల్-2025 ఆరంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. మార్చి 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్ సంబురాలు మొదలు కానున్నాయి. నెలన్నర పాటు సమ్మర్‌లో ఆడియెన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుందీ లీగ్. ఫ్రాంచైజీలంతా రియల్ ఫైట్ కోసం రెడీ అవుతున్నాయి. ఈ తరుణంలో ఐపీఎల్ నిర్వాహకులు తీసుకొచ్చిన ఓ రూల్ వారి గుండెల్లో గుబులు రేపుతోంది. ఇప్పుడు అంపైర్ల మీదే జట్లు భారం వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలు ఏంటా రూల్.. అంపైర్లతో దానికేం సంబంధం అనేది ఇప్పుడు చూద్దాం..


రాత్రి మ్యాచులకే..

కొత్త సీజన్ నేపథ్యంలో పలు నయా రూల్స్‌ను ప్రవేశపెట్టారు ఐపీఎల్ నిర్వాహకులు. అందులో ఒకటి న్యూ బాల్. రాత్రి పూట జరిగే మ్యాచుల్లో కొన్నిసార్లు మంచు ప్రభావం ఎక్కువగా ఉండటం చూస్తూనే ఉన్నాం. డ్యూ కారణంగా బంతి తడిగా మారి బౌలర్లకు పట్టు లభించదు. దీంతో చేజ్ చేసే టీమ్ భారీగా పరుగులు పిండుకునే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండో ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ నుంచి మరో బంతిని తీసుకునేందుకు బీసీసీఐ చాన్స్ ఇస్తోంది. అయితే కొత్త బంతి కావాలని కెప్టెన్స్ కోరినా.. ఇచ్చే అధికారం అంపైర్ల మీదే ఉంటుంది.


ఎవరికి అనుకూలం

మంచు అధికంగా ఉందా.. లేదా.. అనేది ఫీల్డ్ అంపైర్లు పరిశీలిస్తారు. దాన్ని బట్టి కొత్త బంతి ఇవ్వాలా.. వద్దా.. అనేది వాళ్లే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ బంతి మార్చాలని భావించినా.. న్యూ బాల్ ఇవ్వరు. ఏ బాల్‌ను చేంజ్ చేస్తున్నారో.. దాదాపు అలాంటిదే మరో బాల్‌ ఇచ్చి మ్యాచ్‌ను కంటిన్యూ చేస్తారు. ఈ రూల్ మధ్యాహ్నం జరిగే మ్యాచులకు వర్తించదు. ఇప్పుడు దీని మీదే డిస్కషన్స్ ఊపందుకున్నాయి. అంపైర్ల విచక్షణను బట్టే బంతి మార్పు అంశం ఆధారపడటంతో వాళ్లు ముంచుతారో.. తేలుస్తారోనని టెన్షన్ పడుతున్నాయట ఫ్రాంచైజీలు. సరైన సమయంలో వేరే బంతి ఇవ్వకపోతే ఛేజింగ్ టీమ్స్ తమను బాదేయడం ఖాయమని ఆందోళన చెందుతున్నాయట. ఇది తెలిసిన నెటిజన్స్.. అంపైరింగ్ ప్రమాణాలు హైక్వాలిటీ ఉండాలని.. లేకపోతే కొత్త రూల్ వల్ల కెప్టెన్స్-అంపైర్లకు మధ్య గొడవలు జరిగే ప్రమాదం కూడా పొంచి ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రయోగాలు సక్సెస్ అవ్వాలంటే రెండు జట్లకూ సేమ్ బెనిఫిట్స్ ఉండాలని.. అది అంపైరింగ్ వల్లే సాధ్యమని, కాస్త తేడా కొట్టినా విమర్శలు తప్పవని హెచ్చరిస్తున్నారు.


ఇవీ చదవండి:

బౌలర్లకు ఊరట

మళ్లీ దబిడి దిబిడే!

చాహల్‌-ధనశ్రీకి విడాకులు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2025 | 09:21 AM