Share News

SRH IPL 2025 Schedule: ఉప్పల్‌లో 9 ఐపీఎల్ మ్యాచులు.. డేట్స్, టైమింగ్స్ ఇవే..

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:18 PM

IPL 2025 SRH Timetable: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి కప్పు వదిలేలా కనిపించడం లేదు. లాస్ట్ టైమ్ తృటిలో చేజారిన ట్రోఫీని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తోంది.

SRH IPL 2025 Schedule: ఉప్పల్‌లో 9 ఐపీఎల్ మ్యాచులు.. డేట్స్, టైమింగ్స్ ఇవే..
SRH IPL 2025 Schedule

ఐపీఎల్‌లో హాట్ ఫేవరెట్లలో ఒకటైన సన్‌రైజర్స్ జట్టు మరోమారు కప్పుపై కన్నేసింది. అరివీర భయంకర బ్యాటర్లతో కూడిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి ట్రోఫీ వదిలేదేలే అనే పట్టుదలతో ఉంది. గతేడాది మిస్ అయిన కప్పును ఈసారి చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా బయటి మ్యాచుల కంటే హోమ్ మ్యాచెస్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచులు ఎప్పుడెప్పుడు జరుగుతాయి.. టైమింగ్స్ ఏంటి.. అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..


తొలి మ్యాచ్ వాళ్లతోనే..

ఈ సీజన్‌లో మొత్తం 7 హోమ్ మ్యాచ్‌లను ఆడుతుంది ఆరెంజ్ ఆర్మీ. అన్ని మ్యాచ్‌లు కూడా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే జరుగుతాయి. టైమింగ్స్ విషయానికొస్తే.. సాధారణంగా రాత్రి 7:30 గంటలకు మ్యాచులు మొదలవుతాయి. కానీ మార్చి 23వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే ఓపెనింగ్ మ్యాచ్ మాత్రం మధ్యాహ్నం 3:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు డబుల్ హెడర్ ఉండటంతో మ్యాచ్ మధ్యాహ్నం జరగనుంది.


ఒక్కటి మినహా అన్నీ రాత్రే..

కమిన్స్ సేన మార్చి 23న తొలి మ్యాచ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో పోటీపడనుంది. మార్చి 27న లక్నో సూపర్ జియాంట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఎస్‌ఆర్‌హెచ్ ఆడే అన్ని మ్యాచులు ఇదే టైమ్‌లో జరుగుతాయి. ఏప్రిల్ 6న గుజరాత్ టైటాన్స్, ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్, ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌, మే 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉప్పల్‌లో అమీతుమీ తేల్చుకోనుంది ఆరెంజ్ ఆర్మీ. ఆఖరుగా మే 10న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చివరి హోమ్ మ్యాచ్ ఆడనుంది సన్‌రైజర్స్.


ఇవీ చదవండి:

483 మ్యాచులకు అంపైరింగ్ రిటైర్మెంట్

ఎస్ఆర్‌హెచ్ మ్యాచుల టికెట్స్ బుక్ చేసుకోండిలా..

హార్దిక్‌ను బకరా చేసిన బీసీసీఐ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2025 | 04:29 PM