Share News

IPL 2025: 483 మ్యాచులకు అంపైరింగ్.. ఐపీఎల్‌కు ముందు రిటైర్మెంట్

ABN , Publish Date - Mar 21 , 2025 | 02:54 PM

Anil Chaudhary ICC Umpire: ఒక వెటరన్ అంపైర్ తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. వందల కొద్దీ మ్యాచులకు అంపైరింగ్ చేసిన ఆయన.. హఠాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. మరి.. ఆ అంపైర్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

IPL 2025: 483 మ్యాచులకు అంపైరింగ్.. ఐపీఎల్‌కు ముందు రిటైర్మెంట్
IPL 2025 Umpires

వెటరన్ అంపైర్ అనిల్ చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 483 మ్యాచులకు అంపైరింగ్ చేసిన ఈ దిగ్గజం.. ఇంటర్నేషనల్ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇక మీదట యూఏఈ, యూఎస్ టీ20 లీగ్స్‌లో మాత్రమే అంపైరింగ్ చేస్తానని వెల్లడించాడు. భారత క్రికెట్ బోర్డు నిర్వహించే టోర్నమెంట్లలోనూ ఆయన కనిపించే అవకాశం లేదు. చివరగా కేరళ-విదర్భ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ 2024-25 ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించాడు అనిల్ చౌదరి.


నెక్స్ట్ ఏంటి..

అనిల్ చౌదరి అంపైరింగ్ కెరీర్ 2013లో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన 12 టెస్టులు, 49 వన్డేలు, 131 ఐపీఎల్ మ్యాచుల్లో అంపైర్‌గా వ్యవహరించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే.. 91 ఫస్ట్‌క్లాస్ మ్యాచులు, 114 లిస్ట్ ఏ, 28 టీ20 మ్యాచులకు అంపైరింగ్ చేశాడు అనిల్ చౌదరి. అంతర్జాతీయంగా చూసుకుంటే.. 2023, సెప్టెంబర్ 27న తన భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రాజ్‌కోట్ వన్డే మ్యాచ్‌కు ఆయన అంపైర్‌గా ఉన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌, ఐపీఎల్‌కు దూరమైనా.. యూఎస్, యూఏఈ లీగ్స్‌లో మాత్రం అంపైరింగ్‌తో అలరించనున్నాడు అనిల్ చౌదరి. మరో కెరీర్‌ను కూడా ఆయన బిల్డ్ చేసుకునే పనిలో చాలా బిజీగా ఉన్నాడు. అదే కామెంట్రీ. ఈ మధ్య ఆయన కామెంట్రీతో బిజీ అయిపోయారు. ఆడియెన్స్‌ను బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో ఆ రోల్‌లో ఆయన మెరిశాడు. ఐపీఎల్‌లో అంపైరింగ్ చేయడం చాలా కష్టమని.. తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని ఓ సందర్భంలో ఆయన చెప్పాడు.


ఇవీ చదవండి:

ఎస్ఆర్‌హెచ్ మ్యాచుల టికెట్స్ బుక్ చేసుకోండిలా..

హార్దిక్‌ను బకరా చేసిన బీసీసీఐ

ఐపీఎల్ 2025 ఫుల్ షెడ్యూల్ ఇదే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2025 | 03:54 PM