Cricket: క్రికెట్‌లో వాడే జూమ్ కెమెరా.. దీని పనితనం చూస్తే వావ్ అనాల్సిందే
ABN , Publish Date - Jan 13 , 2025 | 03:57 PM
క్రికెట్‌లో చాలా కెమెరాలు వాడుతుంటారు. అందులో జూమింగ్ కెమెరా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. స్టాండ్స్‌లో ఉన్న అభిమానుల దగ్గర నుంచి స్టేడియంలో ఉన్న ప్లేయర్ల వరకు మొత్తం యాక్షన్‌ను ఈ కెమెరాతో జూమ్ చేసి చూపిస్తుంటారు.
క్రికెట్ మ్యాచులు అంటే ప్లేయర్లు, అంపైర్లు, రిఫరీలే గుర్తుకొస్తారు. కానీ ఒక మ్యాచ్ నిర్వహణలో పిచ్ క్యూరేటర్ దగ్గర నుంచి గ్రౌండ్ సిబ్బంది, స్కోరర్స్, కెమెరామెన్ వరకు ఎంతో మంది శ్రమ దాగి ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెమెరాల గురించి. ఇవి లేకపోతే మనం ఇంత ఈజీగా మొబైల్ ఫోన్లు, టీవీల్లో లైవ్ మ్యాచులు చూసేవాళ్లం కాదు. క్రికెట్ కవరేజ్ కోసం చాలా కెమెరాలు వాడుతుంటారు. రోజురోజుకీ మరింత అధునాతన కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు మ్యాచుల్లో సాధారణ కెమెరాలతో పాటు హాక్-ఐ, స్పైడర్‌క్యామ్ అంటూ ఎన్నో రకాలు వాడుతున్నారు. అయితే వాటిల్లో జూమింగ్ కెమెరా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వాటే కవరేజ్!
స్టాండ్స్‌లో ఉన్న అభిమానుల దగ్గర నుంచి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ప్లేయర్ల వరకు మొత్తం యాక్షన్‌ను ఈ కెమెరాతో జూమ్ చేసి చూపిస్తుంటారు. ఔట్, క్యాచ్, రనౌట్‌తో పాటు టీమ్స్ డగౌట్, డ్రెస్సింగ్ రూమ్ మీద ఈ కెమెరా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓవర్ గ్యాప్‌లో స్టేడియంలో మ్యాచుల్ని తిలకిస్తున్న అభిమానుల వైపు కూడా కెమెరాను తిప్పుతుంటారు. తాజాగా ఈ జూమింగ్ కెమెరా పనితనంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. మైదానంలోని కెమెరామెన్ దగ్గరకు వెళ్లిన పఠాన్.. ఆ కెమెరా ఎలా పనిచేస్తుందో కెమెరామన్‌తో చెప్పించాడు.
కెమెరామెన్‌ను అడగడంతో..
స్టేడియంలో అందరి కంటే పైన కూర్చున్న ముగ్గురు అభిమానులను కెమెరాలో చూపించమని కెమెరాన్‌మెన్‌ను పఠాన్ అడిగాడు. దీంతో అతడు వెంటనే జూమ్ చేసి వాళ్లు ఏం చేస్తున్నారో చూపించాడు. ఇటీవల భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా తీసిన వీడియోలా ఇది కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. జూమ్ కెమెరా మాయ మామూలుగా లేదని కామెంట్స్ చేస్తున్నారు. టెక్నాలజీని ఇంత బాగా అందిపుచ్చుకున్నారు కాబట్టే మ్యాచుల లైవ్ స్ట్రీమింగ్ అదిరిపోయిందని అంటున్నారు.
ఇవీ చదవండి:
భారత్-పాక్ రైవల్రీపై క్రేజీ డాక్యుమెంటరీ.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్
జాన్వీ కపూర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. అసలు నిజం ఇదే..
6 మ్యాచుల్లో 5 సెంచరీలు.. ఆర్సీబీ బ్యాటర్ కొత్త చరిత్ర
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి