Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్.. బుమ్రా ఊహకందని ఫీట్.. ఇదెలా సాధ్యం..
ABN , Publish Date - Jan 01 , 2025 | 05:04 PM
ICC Rankings: భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది. చేతికి బంతి ఇస్తే వికెట్ల వర్షం కురిపిస్తున్న ఈ ఫాస్ట్ బౌలర్.. సారథ్య పగ్గాలు ఇస్తే జట్టుకు భారీ విజయాలు అందిస్తున్నాడు. అలాంటోడు తాజాగా మరో అరుదైన ఫీట్ అందుకున్నాడు.
IND vs AUS: భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది. చేతికి బంతి ఇస్తే వికెట్ల వర్షం కురిపిస్తున్న ఈ ఫాస్ట్ బౌలర్.. సారథ్య పగ్గాలు ఇస్తే జట్టుకు భారీ విజయాలు అందిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వికెట్ల మీద వికెట్లు తీస్తూ ఆస్ట్రేలియా బ్యాటర్లకు ఓ రేంజ్‌లో పోయిస్తున్నాడు. ఖవాజా నుంచి స్మిత్ వరకు.. లబుషేన్ నుంచి మార్ష్ వరకు ఒక్కో బ్యాటర్‌ను టార్గెట్ చేసి మరీ ఔట్ చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్న బుమ్రా.. ఆరంభంలో పెర్త్ టెస్ట్‌లో కెప్టెన్సీ చేసి జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. అలాంటోడు ఇప్పుడు మరో అరుదైన ఫీట్ నమోదు చేశాడు. అసలు బుమ్రా నెలకొల్పిన ఆ క్రేజీ రికార్డు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
సరికొత్త రికార్డు
ఫార్మాట్‌తో సంబంధం లేకుండా వికెట్ల వర్షం కురిపిస్తూ ప్రస్తుత క్రికెట్‌లో బౌలింగ్ రారాజుగా కొనసాగుతున్నాడు బుమ్రా. ఐసీసీ ప్రకటించే ర్యాంకింగ్స్‌లోనూ అతడిదే హవా. జనవరి 1, 2025 నాడు అనౌన్స్ చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పేసుగుర్రం తన ఛరిష్మా చూపించాడు. 907 రేటింగ్ పాయింట్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో కంటిన్యూ అవుతున్నాడు. అయితే టాప్ ప్లేస్‌లో నిలవడం కంటే కూడా రేటింగ్ పాయింట్ల ప్రాతిపదికన బుమ్రా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు పొందిన భారత బౌలర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు.
అశ్విన్‌ను దాటేసి..
కొన్ని రోజుల కింద ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకటించిన సమయంలో 904 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో నిలిచాడు బుమ్రా. ఈ క్రమంలో టెస్టు ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సంపాదించిన ఇండియన్ బౌలర్‌గా లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ (904 రేటింగ్ పాయింట్లు) రికార్డును సమం చేశాడు. తాజాగా అనౌన్స్ చేసిన ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ను కూడా దాటేసి 907 పాయింట్లతో హిస్టరీ క్రియేట్ చేశాడు బుమ్రా. ఇన్ని పాయింట్లు నమోదు చేసిన వారి జాబితాలో ఇంగ్లండ్ స్పిన్నర్ డెరెక్ అండర్‌వుడ్‌తో కలసి సంయుక్తంగా 17వ స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో హయ్యెస్ట్ రేటింగ్ పాయింట్స్ కలిగిన ఆటగాడిగా ఇంగ్లండ్ సీమర్ సిడ్నీ బేర్న్స్ (932) ఇంకా టాప్‌లో కంటిన్యూ అవుతున్నాడు. బుమ్రా ఉన్న ఊపు చూస్తుంటే త్వరలోనే ఈ రికార్డును బద్దలుకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్స్.. అశ్విన్ రికార్డును కొట్టడమే అసాధ్యం అనుకుంటే అతడ్నే దాటేశాడు.. ఇదెలా సాధ్యమంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అతడి స్వయంకృషి, పట్టుదల, కష్టం వల్లే సాధ్యమైందని కామెంట్స్ చేస్తున్నారు.