Share News

Jasprit Bumrah: ఆ మాటలు నమ్మొద్దు.. ఫ్యాన్స్‌కు బుమ్రా రిక్వెస్ట్

ABN , Publish Date - Jan 16 , 2025 | 08:50 AM

టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశాడు. దయచేసి ఆ మాటలు నమ్మొద్దని కోరాడు. ఇంతకీ బుమ్రా ఫ్యాన్స్‌కు చేసిన విజ్ఞప్తి ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah: ఆ మాటలు నమ్మొద్దు.. ఫ్యాన్స్‌కు బుమ్రా రిక్వెస్ట్
Jasprit Bumrah

టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా త్వరలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడని తెలుస్తోంది. గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మధ్యలోనే మైదానాన్ని వీడిన బుమ్రా.. ఆ మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగలేదు. దీంతో కొన్నాళ్లు ఎన్‌సీఏలో పునరావాసంలో ఉండనున్నాడని సమాచారం. అయితే అతడు ఎప్పటివరకు కోలుకుంటాడనే దానిపై క్లారిటీ లేదు. ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు అతడ్ని ఎంపిక చేయలేదు. వచ్చే నెలలో జరిగే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో పేసుగుర్రం బరిలోకి దిగుతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. అతడు మెగా టోర్నీలో ఆడడని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దయచేసి ఆ మాటలు నమ్మొద్దని ఫ్యాన్స్‌ను కోరాడు.


అస్సలు నమ్మొద్దు!

గాయం వార్తలపై బుమ్రా రియాక్ట్ అయ్యాడు. తనకు ఇంజ్యురీ అయిందని జరుగుతున్న ప్రచారంపై అతడు క్లారిటీ ఇచ్చాడు. తన హెల్త్ మీద తప్పుడు ప్రచారం జరుగుతోందని స్పష్టం చేశాడు. అదంతా నిరాధార ప్రచారమని.. అస్సలు నమ్మొద్దని పేర్కొన్నాడు. ఇలాంటి రూమర్స్ నవ్వు తెప్పిస్తాయని ట్వీట్ చేశాడు. కాగా, బుమ్రా త్వరలో ఎన్‌సీఏకు వెళ్తాడని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. తొలుత తీసిన రిపోర్ట్స్‌‌లో అతడికి ఫ్రాక్చర్ అవలేదని తేలిందని.. కానీ తర్వాత మాత్రం వెన్నులో వాపు ఏర్పడినట్లు వచ్చిందని వినిపిస్తోంది.


3 వారాలు అక్కడే!

వచ్చే 3 వారాల పాటు నేషనల్ క్రికెట్ అకాడమీలో బుమ్రా పునరావాసంలో ఉంటాడని సమాచారం. మెడికల్ టీమ్ పర్యవేక్షణలో అతడు రికవర్ అవుతాడని తెలుస్తోంది. అతడ్ని ఎన్‌సీఏ బృందం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారట. కోలుకున్న తర్వాత ఒకట్రెండు మ్యాచ్‌లు ఆడిస్తారట. అందులో బౌలింగ్ చేసే తీరు, రనప్, ఫిట్‌నెస్‌‌ను అంచనా వేశాకే క్లియరెన్స్ ఇవ్వాలా? వద్దా? అనేది డిసైడ్ చేస్తారని సమాచారం. చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడటం భారత్‌కు కీలకం. కానీ ఆ టోర్నీ కోసమని ఫిట్‌గా లేకున్నా బరిలోకి దింపితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ మళ్లీ వాపు మొదలైనా, పాత గాయాలు తిరగబెట్టినా అతడి కెరీర్ డేంజర్‌లో పడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇవీ చదవండి:

పారిస్‌ పతకాల నాణ్యతపై విమర్శలు

ఒలింపిక్‌ చాంపియన్‌కు షాక్‌

మంధాన, ప్రతిక శతక జోరు రికార్డుల హోరు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 16 , 2025 | 08:50 AM