KKR vs RR Prediction IPL 2025: కోల్‌కతా వర్సెస్ రాజస్థాన్.. ఖాతా తెరిచేదెవరో..
ABN , Publish Date - Mar 26 , 2025 | 02:39 PM
IPL 2025 Match Predictions: ఐపీఎల్‌లో మరో ఇంట్రెస్టింగ్ క్లాష్‌కు అంతా రెడీ అయింది. బోణీ కొట్టేందుకు ఎదురు చూస్తున్న రెండు బిగ్ టీమ్స్ మధ్య ఇవాళ ఆసక్తికర సమరం జరగనుంది. ఆ జట్లే కేకేఆర్-ఆర్ఆర్.

ఐపీఎల్-2025లో బోణీ కోసం ఇవాళ ఓ కొట్లాట జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఫేవరెట్స్‌లో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇవాళ ఇంట్రస్టింగ్ ఫైట్ జరగనుంది. తలో మ్యాచ్ ఆడేసిన ఈ టీమ్స్.. కొత్త సీజన్‌లో ఇంకా ఖాతా తెరవలేదు. అందుకే బోణీ కోసం బరిలోకి దిగి కొట్లాడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి పోరులో ఇరు జట్లలో గెలుపు ఎవర్ని వరించనుంది.. అనేది ఇప్పుడు చూద్దాం..
బలాలు
కోల్‌కతా: సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి కేకేఆర్‌కు అతిపెద్ద బలం. ముఖ్యంగా నరైన్ అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ రాణించగలడు. రస్సెల్ లాంటి మరో క్వాలిటీ ఆల్‌రౌండర్ కేకేఆర్ సొంతం. వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ మ్యాచ్‌ను ఒంటిచేత్తో ముగించగలరు.
రాజస్థాన్: ఈ జట్టు బ్యాటింగ్ డెప్త్ బాగుంది. జైస్వాల్, శాంసన్, జురెల్, హెట్‌మెయిర్, శుభమ్ దూబె రూపంలో మంచి బ్యాటర్లు రాజస్థాన్‌లో ఉన్నారు. వీళ్లలో హెట్‌మెయిర్ సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రాణించాడు. జురెల్ కూడా ఆ మ్యాచ్‌లో దుమ్మురేపాడు. సంజూ కూడా తన టచ్‌ను ప్రూవ్ చేశాడు. బౌలింగ్‌లో తీక్షణ, తుషార్ దేశ్‌పాండే రాణిస్తుండటం కలిసొచ్చే అంశం.
బలహీనతలు
కోల్‌కతా: బ్యాటింగ్ యూనిట్ ఇంకా కుదురుకోలేదు. ఆర్సీబీతో మ్యాచ్‌లో రహానె, నరైన్ మాత్రమే రాణించారు. రస్సెల్, అయ్యర్ త్వరగా ఫామ్‌ను అందుకోవాలి. రింకూ కూడా టచ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో నరైన్ తప్ప ఎవరూ ఎవరూ ఆకట్టుకోవడం లేదు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి భారీగా పరుగులు సమర్పించుకోవడం కేకేఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
రాజస్థాన్: ఓపెనర్ జైస్వాల్ తొలి మ్యాచ్‌లో రాణించలేదు. 1 పరుగుకే ఔట్ అయ్యాడు. రియాన్ పరాగ్, నితీష్ రాణా కూడా సన్‌రైజర్స్‌పై ఫ్లాప్ అయ్యారు. బౌలింగ్‌లో ప్రధాన అస్త్రం వంటి జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. ఫజల్‌హక్ ఫారూకీ కూడా ధారాళంగా రన్స్ ఇవ్వడం ఆర్ఆర్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
హెడ్ టు హెడ్
ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 31 మ్యాచులు జరిగాయి. అందులో కేకేఆర్ 15 సార్లు, రాజస్థాన్ 14 సార్లు విజయం సాధించాయి. మరో రెండు మ్యాచుల్లో ఫలితం రాలేదు.
తుది అంచనా
బలాబలాలు, రికార్డులు, ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా గెలవడం ఖాయం.
ఇవీ చదవండి:
రహానేకు అవమానం.. కెప్టెన్ అని చూడకుండా..
ఉప్పల్‌లో కొడితే బోడుప్పల్‌లో పడాలె
ప్లీజ్.. రోహిత్‌ను ఏమీ అనొద్దు: సిరాజ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి