KKR vs SRH: అదే మా కొంపముంచింది.. ఓటమిపై కమిన్స్ కామెంట్స్
ABN , Publish Date - Apr 04 , 2025 | 10:48 AM
IPL 2025: ఐపీఎల్ నయా ఎడిషన్‌లో వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. కేకేఆర్ చేతిలో దారుణంగా ఓటమి పాలైంది కమిన్స్ సేన.

ఐపీఎల్ లాస్ట్ ఇయర్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి పేలవంగా ఆడుతోంది. ఆ టీమ్ ఫ్లాప్ షో నడుస్తోంది. వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది ఆరెంజ్ ఆర్మీ. తాజా సీజన్ మొదటి మ్యాచ్‌లో నెగ్గిన కమిన్స్ సేన.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానానికి పడిపోయింది. అన్ని మ్యాచులు ఒకెత్తయితే నిన్న కేకేఆర్ చేతిలో ఓడిన తీరు మరొకెత్తు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింటా దారుణ ప్రదర్శనతో భారీ మూల్యం చెల్లించుకుంది సన్‌రైజర్స్. ఈ ఓటమిపై టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. అతడు ఏమన్నాడంటే..
అంత ఈజీ కాదు
కోల్‌కతా చేతుల్లో ఓటమికి ఫీల్డింగ్ వైఫల్యమే కారణమని కమిన్స్ అన్నాడు. పిచ్ చాలా బాగుందని, బాగా ఆడితే టార్గెట్ చేజ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నాడు. అయితే ఫీల్డింగ్‌లో చాలా క్యాచులు జారవిడిచామని.. అదే తమ కొంపముంచిందన్నాడు. వరుసగా మూడు ఓటములు ఎదురైతే జీర్ణించుకోవడం కష్టమే.. కానీ ఆటతీరు, వ్యూహాలు మొదలైన వాటిని మళ్లీ సమీక్షించుకునేందుకు ఇదే సరైన తరుణమని కమిన్స్ పేర్కొన్నాడు. ఫీల్డింగ్‌తో పాటు పేలవమైన బౌలింగ్ తమ నుంచి మ్యాచ్‌ను దూరం చేసిందన్నాడు. నెక్స్ట్ మ్యాచ్‌లో స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు కమిన్స్. బంతి ఎక్కువగా తిరగకపోవడంతో స్పిన్నర్ ఆడమ్ జంపాను టీమ్‌లోకి తీసుకోలేదన్నాడు. ఇకపై తమ ప్రయాణాన్ని సరికొత్తగా మొదలుపెట్టాల్సిన అవసరం ఉందన్నాడు సన్‌రైజర్స్ సారథి.
ఇవీ చదవండి:
ఆ అమ్మాయే.. నా గాళ్‌ఫ్రెండ్: ధవన్
ఆసియా క్రికెట్ చైర్మన్‌గా నఖ్వీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి