Share News

Australia: చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు మరో షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:22 PM

Cricket Australia: చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గాయాలతో కొందరు ఆటగాళ్లు టీమ్‌కు దూరమైన వేళ.. ఓ స్టార్ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్ తీసుకొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

Australia: చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు మరో షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్
Australia

చాంపియన్స్ ట్రోఫీ కప్పు మీద కన్నేసిన ఆస్ట్రేలియా జట్టుకు టోర్నమెంట్ ఆరంభానికి ముందు వరుస షాకులు తగులుతున్నాయి. గాయంతో ఇబ్బంది పడుతున్న ఆ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంకా కోలుకోలేదు. బౌలింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయకపోవడంతో అతడు ఇక మెగా టోర్నీకి దూరమైనట్లేనని.. ఆడటం కష్టమేనని రీసెంట్‌గా కంగారూ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపాడు. ఇంజ్యురీతో బాధపడుతున్న పేసర్ జోష్ హేజల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ కూడా టోర్నీలో ఆడరని దాదాపుగా తేలిపోయింది. ఈ సమయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఒకరు రిటైర్మెంట్ నిర్ణయంతో అందర్నీ షాక్‌కు గురిచేశాడు. ఎవరా ఆటగాడు? అనేది ఇప్పుడు చూద్దాం..


ట్రోఫీ ఆశలు గల్లంతు!

వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్నాడు ఆసీస్ స్టార్ మార్కస్ స్టొయినిస్. వన్డేల నుంచి తప్పుకున్నా.. పొట్టి ఫార్మాట్ మ్యాచులకు మాత్రం అతడు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఇక మీదట కేవలం టీ20ల మీదే ఫోకస్ చేయాలనే ఆలోచనతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, జనవరి 13వ తేదీన క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో స్టొయినిస్‌కు చోటు దక్కింది. అయితే నెల తిరగకముందే అతడు రిటైర్ అవుతున్నట్లు ఎందుకు ప్రకటించాడో ఎవరికీ అంతుపట్టడం లేదు. కమిన్స్, హేజల్‌వుడ్‌, మార్ష్ గాయాల వల్ల దూరమైతే.. ఇప్పుడు స్టొయినిస్ రిటైర్మెంట్‌తో కంగారూల చాంపియన్స్ ట్రోఫీ ఆశలు మరింత సన్నగిల్లాయి. ఆ జట్టు లీగ్ దశ దాటడం కూడా కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇవీ చదవండి:

తెలుగోళ్ల ప్రేమకు కేన్ మామ ఫిదా.. ఆ పేరు అదిరిపోయిందంటూ..

కివీస్‌కు కాళరాత్రి.. సచిన్ శివతాండవం.. ఈ ఇన్నింగ్స్‌ గుర్తుందా

‘చాంపియన్స్‌’కు ముందు భలే చాన్స్‌!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 06 , 2025 | 04:31 PM