Share News

Nitish Kumar Reddy: ప్రైజ్ ట్యాగ్ అక్కర్లేదు.. బాంబు పేల్చిన తెలుగోడు

ABN , Publish Date - Mar 20 , 2025 | 04:00 PM

SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి దుమ్మురేపాలని చూస్తోంది. గతేడాదిలాగే ఈసారి కూడా ఐపీఎల్‌లో చెలరేగి ఆడాలని అనుకుంటోంది. అందుకు తగ్గ ప్లానింగ్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ రెడీ చేస్తోంది.

Nitish Kumar Reddy: ప్రైజ్ ట్యాగ్ అక్కర్లేదు.. బాంబు పేల్చిన తెలుగోడు
Nitish Kumar Reddy

ఫ్రాంచైజీ క్రికెట్‌లో లాయల్టీకి అంతగా ఆస్కారం ఉండదు. ఇక్కడ జట్లు గానీ ఆటగాళ్లు గానీ స్వలాభమే ఎక్కువగా చూసుకుంటారు. అందుకే మంచి ఆఫర్స్ వస్తే చాలా మంది ప్లేయర్లు తుర్రుమని ఎగిరిపోవడం చూస్తుంటాం. కావాల్సిన క్రికెటర్లను కోట్లు ఖర్చు పెట్టి టీమ్స్ దక్కించుకోవడం కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం లాయల్టీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆ కోవలోకే వస్తాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. తనకు అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ విషయంలో నితీష్ వ్యవహరించిన తీరే దీనికి ఎగ్జాంపుల్. ఈ విషయంపై అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


అదే నాకు గర్వం

గతేడాది ఐపీఎల్‌లో ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలిచిన నితీష్ ఈసారి వేరే జట్టుకు మారతాడని చాలా మంది అనుకున్నారు. కానీ అతడు మాత్రం తెలుగు జట్టుకే తన ఓటు వేశాడు. డబ్బుల కంటే విలువలే ముఖ్యమని నమ్మి.. ఎస్‌ఆర్‌హెచ్‌పై కృతజ్ఞత చూపించాడు. దీనిపై తాజాగా అతడు రియాక్ట్ అయ్యాడు. తనకు ప్రైస్ ట్యాగ్ అక్కర్లేదంటూ బాంబు పేల్చాడు. మనీ కంటే ప్యాషనే తనకు ముఖ్యమని చెప్పాడు. ఆరెంజ్ ఆర్మీలో ఆడటం తనకు గర్వంగా ఉందన్నాడు నితీష్.


నా హార్ట్ ఇక్కడే..

సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం తనను మొదట్నుంచి నమ్మిందన్నాడు నితీష్. ఆ నమ్మకం, విశ్వసనీయతను నిలబెట్టుకోవడమే తన లక్ష్యం అన్నాడు తెలుగోడు. తన హార్ట్ ఆరెంజ్ ఆర్మీతోనే ఉందన్నాడు. ఇతర ఫ్రాంచైజీలు తన కోసం స్కెచ్ వేశాయని.. అయితే ఎన్ని ఆఫర్లు వచ్చినా వాటిని పట్టించుకోలేదన్నాడు నితీష్. ఓ తెలుగువాడిగా ఇక్కడి టీమ్‌కు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. డబ్బుల కంటే తన ఆట, టీమ్‌ను గెలిపించడం మీదే ఫోకస్ పెడతానని స్పష్టం చేశాడు నితీష్ రెడ్డి.


ఇవీ చదవండి:

ఐపీఎల్ కోసం పాంటింగ్ ప్రత్యేక పూజలు

టీమిండియా స్టార్లపై కోట్ల వర్షం

సంజూ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 20 , 2025 | 04:06 PM