SRH: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ న్యూస్.. తెలుగోడు వచ్చేస్తున్నాడు
ABN , Publish Date - Mar 15 , 2025 | 02:02 PM
IPL 2025: ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓ గుడ్ న్యూస్. అసలైనోడు వచ్చేస్తున్నాడు. ప్రత్యర్థుల దుమ్ముదులిపే తెలుగోడి రాక ఖాయమైంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అదిరిపోయే న్యూస్. సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే తెలుగోడి రాక ఖాయమైంది. టోర్నమెంట్‌లో ఆడతాడో లేదో అనుకుంటే తొలి మ్యాచ్ నుంచే బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నాడా ధమాకా ప్లేయర్. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆపడం అంత ఈజీ కాదు. టోర్నీ ఆరంభానికి ముందే ఆరెంజ్ ఆర్మీ క్యాంప్‌లో అంత జోష్, పాజిటివ్ ఎనర్జీ నింపుతున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు.. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి. ఈ ఐపీఎల్‌లో అతడు ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
బోర్డు నుంచి క్లియరెన్స్
పక్కటెముకల నొప్పి వల్ల ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు నితీశ్ రెడ్డి. ఫస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ చేయని తెలుగోడు.. సెకండ్ టీ20 కోసం ప్రాక్టీస్ చేస్తుండగా గాయం బారిన పడ్డాడు. మిగిలిన మ్యాచులతో పాటు మొత్తం వన్డే సిరీస్‌కు కూడా అతడు దూరమయ్యాడు. ఒకవేళ ఇంజ్యురీ కాకపోయి ఉంటే చాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా దుబాయ్ ఫ్లైట్ ఎక్కేవాడు నితీశ్. కానీ ఆ చాన్స్ లేకుండా పోయింది. ఐపీఎల్-2025లో అతడు ఆడతాడా.. లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్. బీసీసీఐ నుంచి నితీశ్‌కు ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిందని వినిపిస్తోంది.
అన్ని టెస్టులు పాస్
బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో జరిగిన ఫిట్‌నెస్ టెస్టులను నితీశ్ రెడ్డి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాడని సమాచారం. బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యో-యో టెస్టులో కూడా తెలుగోడు పాస్ అయినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ క్లియరెన్స్ రావడంతో ఐపీఎల్-2025లో ఆడేందుకు నితీశ్ సిద్ధమవుతున్నాడని వినిపిస్తోంది. త్వరలోనే ఎస్‌ఆర్‌హెచ్ టీమ్‌తో అతడు జాయిన్ కానున్నాడట. అతడి రాకపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అరాచకమేనని ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇస్తున్నారు. కాగా, గతేడాది ఆఖర్లో జరిగిన మెగా ఆక్షన్‌కు ముందు నితీశ్‌ను రూ.6 కోట్లకు అట్టిపెట్టుకుంది ఆరెంజ్ ఆర్మీ.
ఇవీ చదవండి:
బుమ్రాపై ఆసీస్ లెజెండ్ సీరియస్
కూర్చున్న కొమ్మ నరుక్కుంటున్న రాహుల్
గ్రౌండ్‌లో బూతులు.. రోహిత్ కావాలనే తిడతాడా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి