Share News

Ricky Ponting: ఐపీఎల్ ట్రోఫీ కోసం ప్రత్యేక పూజలు.. పాంటింగ్ వదిలేలా లేడుగా

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:28 PM

IPL 2025: రికీ పాంటింగ్ తగ్గేదేలే అంటున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకునే వరకు వదిలేలా కనిపించడం లేదు. గెలుపు కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు పంటర్.

Ricky Ponting: ఐపీఎల్ ట్రోఫీ కోసం ప్రత్యేక పూజలు.. పాంటింగ్ వదిలేలా లేడుగా
Punjab Kings

ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని టీమ్స్‌లో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఫైనల్స్ వరకు వెళ్లినా కప్పు మాత్రం కొట్టలేకపోయింది. ట్రోఫీ సంగతి దేవుడెరుగు.. రాన్రానూ ప్లేఆఫ్స్ చేరడం కూడా కష్టమైపోయింది. పాయింట్ల టేబుల్‌లో ఎక్కడో మూలన ఉండటం పంజాబ్‌కు రివాజుగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్‌గా ఎంట్రీ ఇచ్చిన రికీ పాంటింగ్.. అన్నీ మార్చేస్తున్నాడు. జట్టు కూర్పు నుంచి వ్యూహ రచన వరకు అన్నీ సరికొత్తగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించాడు పంటర్. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


కప్పు కొట్టే వరకు..

ఐపీఎల్ నయా సీజన్ ఆరంభానికి మరో రెండ్రోజుల సమయమే ఉంది. దీంతో అన్ని జట్లు సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఈ తరుణంలో పంజాబ్ టీమ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది. ట్రోఫీ కోసం ఆటగాళ్లతో పాటు కోచ్ పాంటింగ్ కూడా పూజలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్.. కప్పు కొట్టే వరకు పాంటింగ్ వదిలేలా లేడుగా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పాంటింగ్ పట్టుదలకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురి కూడా తోడైతే పంజాబ్ తొలి కప్పు ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతున్నారు.


సమూల ప్రక్షాళన

7 ఏళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా ఉన్న పాంటింగ్ ఆ టీమ్‌కు కప్పు అందించలేకపోయాడు. ఈసారి పంజాబ్‌కు మారిన పాంటింగ్.. 2028 వరకు పీబీకేఎస్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కప్పుపై కన్నేసిన పంటర్.. టీమ్‌లో సమూల ప్రక్షాళనలు చేశాడు. అయ్యర్ (26.75 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్ (18 కోట్లు-ఆర్టీఎం), యుజ్వేంద్ర చాహల్ (18 కోట్లు)తో టీమ్‌ బ్యాటింగ్, బౌలింగ్ యూనిట్స్‌ను పటిష్టంగా మార్చాడు. మాక్స్‌వెల్, స్టొయినిస్, మార్కో జాన్సన్ లాంటి ఫారెన్ ఆల్‌రౌండర్లను ఎంచుకున్నాడు. ట్రెయినింగ్‌లోనూ తన మార్క్‌ చూపిస్తున్న పంటర్.. ఆసీస్ తరహాలో ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. పదే పదే ప్రాజెక్ట్ పంజాబ్ అని చెబుతున్న పంటర్.. కప్ కలను నెరవేర్చుకుంటాడేమో చూడాలి.


ఇవీ చదవండి:

టీమిండియా స్టార్లపై కోట్ల వర్షం

సంజూ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్

చాహల్ గర్ల్‌ఫ్రెండ్ సంచలన పోస్ట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 20 , 2025 | 03:30 PM