RCB vs CSK Match Prediction: ఆర్సీబీ గెలుపు దాహం తీర్చుకుంటుందా.. ప్రిడిక్షన్ ఇదే
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:28 PM
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చారిత్రాత్మక పోరుకు ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. ఏళ్లుగా రైవల్రీ ఉన్న రెండు టీమ్స్ బరిలోకి దిగి ఢీకొనబోతున్నాయి. అవే సీఎస్‌కే-ఆర్సీబీ.

మే నెల 21వ తేదీ, 2008. ఈ తేదీ ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా.. చివరగా చెపాక్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ గెలిచింది ఆ రోజే. దాదాపు 17 ఏళ్ల కింద చెన్నైని వాళ్ల సొంతగడ్డపై ఓడించింది ఆర్సీబీ. ఆ తర్వాత ఇన్నేళ్లలో ఎన్నిసార్లు మ్యాచులు జరిగినా చెపాక్‌లో ధోని టీమ్‌దే పైచేయి. టీమ్ నిండా స్టార్లతో బరిలోకి దిగినా ఎల్లో ఆర్మీని ఆపలేకపోయింది కోహ్లీ జట్టు. ఈసారి చరిత్రను తిరగరాయాలని బెంగళూరు.. మళ్లీ హిస్టరీ రిపీట్ చేయాలని సీఎస్‌కే పంతంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రికార్డులు ఏం చెబుతున్నాయి, బలాబలాలు ఎలా ఉన్నాయి.. ఓవరాల్‌గా ఇవాళ ఈ రెండు జట్ల మధ్య జరిగే యుద్ధంతో గెలిచేదెవరు అనేది ఇప్పుడు చూద్దాం..
బలాలు
చెన్నై: ఈ ఐపీఎల్‌ను సీఎస్‌కే గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో స్పిన్నర్లు నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. స్పిన్ అడ్డా అయిన చెపాక్ పిచ్‌పై సీఎస్‌కే స్పిన్నర్లను అడ్డుకొని పరుగులు చేయడం అంత ఈజీ కాదు.
ఆర్సీబీ: ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్‌ను మట్టికరిపించడంతో కాన్ఫిడెంట్‌గా ఉంది బెంగళూరు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ, సాల్ట్‌తో పాటు సారథి రజత్ పాటిదార్ బ్యాట్‌తో ఫామ్ చాటుకున్నారు. బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా, జోష్ హేజల్‌వుడ్ రాణించారు. స్పిన్ వీక్‌గా ఉంది అనుకుంటే కృనాల్ ఆ లోటు కనపడనీయకుండా చేస్తున్నాడు.
బలహీనతలు
సీఎస్‌కే: మొదటి మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటింగ్ తడబాటుకు గురైంది. రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబె, సామ్ కర్రన్, దీపక్ హుడా రెండంకెల స్కోరు కూడా చేయలేదు. బ్యాటింగ్ లోపాల్ని అధిగమించకపోతే సీఎస్‌కేకు ఇబ్బందులు తప్పవు.
ఆర్సీబీ: ఈ జట్టులో కృనాల్ ఒక్కడే కాస్త తెలిసిన స్పిన్నర్. సుయాష్ శర్మ ప్రతిభావంతుడే అయినా నిలకడగా వికెట్లు తీస్తాడని చెప్పలేం. అందునా తొలి మ్యాచ్‌లో అతడు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. స్పిన్‌కు స్వర్గధామం లాంటి చెపాక్‌లో ఒకవేళ కృనాల్ గనుక ఫెయిలైతే బౌలింగ్‌లో బెంగళూరుకు కష్టమే. అటు బ్యాటింగ్‌లో పడిక్కల్ టీమ్‌కు సమస్యగా మారాడు. అతడు సాధ్యమైనంత త్వరగా ఫామ్‌ను అందుకోవాలి.
హెడ్ టు హెడ్
ఇప్పటిదాకా ఈ ఇరు జట్ల మధ్య 32 మ్యాచులు జరిగాయి. ఇందులో ఒక దాంట్లో ఫలితం రాలేదు. మిగతా వాటిల్లో చెన్నై 21 మ్యాచుల్లో నెగ్గగా.. 11 మ్యాచుల్లో బెంగళూరు విజయం సాధించింది. అయితే చెపాక్‌లో మాత్రం ధోని టీమ్‌దే పైచేయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన 9 మ్యాచుల్లో ఎనిమిదింట సీఎస్‌కే.. కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఆర్సీబీ నెగ్గాయి.
గెలుపు అంచనా
చెన్నైకి హోమ్ గ్రౌండ్, స్పిన్ బౌలింగ్, హెడ్ టు హెడ్ రికార్డులు అనుకూలంగా ఉన్నాయి. అటు ఆర్సీబీకి బ్యాటింగ్ పవర్ స్ట్రెంగ్త్‌గా ఉంది. ఇరు జట్ల బలాబలాలు, రికార్డులు, ప్రస్తుత ఫామ్, హోమ్ అడ్వాంటేజ్.. ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఇవాళ్టి పోరులో చెన్నై నెగ్గడం ఖాయం.
ఇవీ చదవండి:
ఆ ముగ్గురూ ఆడకపోతే ఎస్‌ఆర్‌హెచ్ తుస్సేనా
కావ్యా పాపను బాధపెట్టారు కదరా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి