RCB vs KKR Pitch Report: ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్.. ఆర్సీబీదే పైచేయా..
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:33 PM
KKR vs RCB 2025: ఐపీఎల్ నయా సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పిచ్ ఎలా ప్రవర్తిస్తుంది.. ఎవరికి అనుకూలం అనేది ఇప్పుడు చూద్దాం..

క్రికెట్ లవర్స్‌కు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఐపీఎల్ వచ్చేసింది. నెలన్నర పాటు ఉత్కంఠభరిత, అద్వితీయ పోరాటాలతో ఫ్యాన్స్‌ను అలరించేందుకు క్యాష్ రిచ్ లీగ్ సిద్ధమైపోయింది. మార్చి 22 నుంచి కొత్త సీజన్ షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్, గతేడాది టాప్-4లో నిలిచిన ఆర్సీబీ పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొట్లాటకు ఆతిథ్యం ఇస్తున్న కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎవరికి అనుకూలం.. అక్కడ కండీషన్స్ ఎలా ఉన్నాయి.. లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
పిచ్ ఎలా ఉందంటే..
ఈడెన్ గార్డెన్స్ పిచ్ మామూలుగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. టీ20 మ్యాచుల్లో ఇక్కడ బ్యాటింగ్‌కు సహకరించే వికెట్లే తయారు చేస్తూ వచ్చారు. ఐపీఎల్ గత సీజన్‌లో ఇక్కడ 200 ప్లస్ స్కోర్లు అనేక సార్లు నమోదయ్యాయి. ఈసారి కూడా బ్యాటింగ్ ట్రాకే రెడీ చేసినట్లు తెలుస్తోంది.
ఎవరికి అనుకూలం
ఈ పిచ్‌పై ఆరంభంలో పేసర్లకు కొంత స్వింగ్, బౌన్స్ దొరుకుతుంది. కానీ ఆట సాగే కొద్దీ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారిపోతుంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు కొంత టర్న్ లభించే అవకాశం ఉందని సమాచారం. అందునా సెకండ్ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ తర్వాత బంతి మార్చే అవకాశం ఉంది కాబట్టి స్పిన్నర్లకు పండగ అనే చెప్పొచ్చు. ఆ లెక్కన వరుణ్ చక్రవర్తి లాంటి తోపు స్పిన్నర్ ఉన్న కేకేఆర్‌కు ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఈడెన్‌లో బౌండరీలు చిన్నవి. కాబట్టి సిక్సులు, ఫోర్లు కొట్టడం ఈజీ. దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాటర్లు విరుచుకుపడినా వికెట్లు తీయడం మీదే బౌలర్లు దృష్టి పెడితే బెటర్ అని విశ్లేషకులు సూచిస్తున్నారు.
వాతావరణం
ఈ మ్యాచ్‌కు హోస్ట్‌గా ఉన్న ఈడెన్ గార్డెన్స్ పరిసరాలు, కోల్‌కతా నగరంలో ఇవాళ సాయంత్రం 28 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉంది. వాన పడే చాన్స్ తక్కువే. కాబట్టి మ్యాచ్ సజావుగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. రాత్రి 9 తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో డ్యూ (మంచు) పడే చాన్స్ ఉంది. దీంతో బౌలర్లకు సవాల్ తప్పేలా లేదు.
రికార్డులు ఇలా ఉన్నాయి..
ఈడెన్ గార్డెన్స్‌లో 2008 నుంచి 2024 వరకు మొత్తం 86 ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు 35 మ్యాచుల్లో విజయఢంకా మోగించాయి. ఛేజింగ్ చేసిన టీమ్స్ 51 సార్లు నెగ్గాయి.
విన్నింగ్ పర్సెంటేజ్
ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ గెలిచిన శాతం 40.7 శాతం. అదే చేజింగ్‌కు దిగిన జట్టు నెగ్గిన శాతం 59.3 శాతం. తొలి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170. సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్‌ఫుల్ చేజింగ్ స్కోర్ 160.
బౌలింగా.. బ్యాటింగా..
ఈడెన్ గార్డెన్స్ రికార్డ్స్ ప్రకారం.. చేజింగ్ చేసిన జట్టుదే విజయం. కానీ రాత్రిపూట డ్యూ (మంచు) ప్రభావం వల్ల బంతి త్వరగా తడిగా మారుతుంది. దీంతో బౌలర్లకు దానిపై పట్టు దొరకదు. ఈ సమయంలో బ్యాటర్లకు షాట్స్ కొట్టడం ఈజీ అవుతుంది. అందుకే ఫస్ట్ బ్యాటింగ్‌కు టీమ్స్ మొగ్గు చూపొచ్చు. డిఫెండ్ చేయడం అంత కష్టమేమీ కాదు. ఇక్కడ గతంలో కేకేఆర్ చాలా మ్యాచుల్లో బిగ్ స్కోర్స్ కాపాడుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి 200 ప్లస్ స్కోర్ సెట్ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. అయితే కోహ్లీ, పాటిదార్, లివింగ్‌స్టన్, సాల్ట్ లాంటి తోపు బ్యాటర్లు ఉన్న ఆర్సీబీకీ చేజింగ్ ఇస్తే ఈజీ అవుతుందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. వరుణ్ చక్రవర్తిని గనుక అడ్డుకుంటే విజయం వాళ్లదేనని చెబుుతున్నారు.
ఇవీ చదవండి:
RCB vs KKR ఫస్ట్ ఫైట్.. ప్లేయింగ్ 11 రివీల్డ్
ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్.. టోర్నీ ఓపెనర్‌లో గెలుపెవరిది
ఫిక్సింగ్ బ్యాటింగ్ మాఫియా కుట్రా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి